అంతర్జాతీయం

2024లో చంద్రుడిపైకి తొలి మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: చంద్రుని మూలాలను కనుక్కోవడానికి ఈ దఫా ఓ మహిళా శాస్తవ్రేత్తను పంపించాలని ‘నాసా’ అంతరిక్ష కేంద్రం నిర్ణయించింది. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం చందమామపైకి ముగ్గురు శాస్తవ్రేత్తల బృందాన్ని పంపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికా విజయోత్సవాన్ని జరుపుకుంటూ మలి దశలో ఆర్టిమిస్ పేరిట రూపొందిస్తున్న ఉపగ్రహంలో ఓ మహిళను, ఆ తర్వాత పురుషున్ని పంపించనున్నట్లు ‘నాసా’ వెల్లడించింది. ఈ మేరకు ఏర్పాట్లు చరుగ్గా సాగుతున్నాయని, 2024 సంవత్సరంలో చంద్రునిపై మహిళ వ్యోమగామి అడుగు పెడతారని పేర్కొన్నది. ఈ దఫా చంద్రునిపై అనేక పరిశోధనలు నిర్వహించనున్నట్లు నాసా తెలిపింది. శాస్త్ర, సాంకేతిక అంశాలతో పాటు మానవులు జీవించేందుకు అనువుగా ఉందా? అనే కోణంలో పరిశోధన నిర్వహించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా నీటి లభ్యత, సహజ వనరుల అనే్వషణ చేయనున్నట్లు వివరించింది. ఆ తర్వాత అంగారక గ్రహంపైనా అనే్వషణ చేయనున్నట్లు నాసా వెల్లడించింది.