అంతర్జాతీయం

వారసత్వ రాజకీయాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 22: పాకిస్తాన్‌లో ప్రధాన ప్రతిపక్షాలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విరుచుకుపడ్డారు. భారత్‌లో మొఘల్ సామాజ్యం పతనం చూసైనా నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి అమెరికా పర్యటనకు విచ్చేశారు. వాషింగ్టన్‌లో ప్రవాస పాకిస్తానీయుల సమావేశంలో ప్రసంగించిన ఖాన్ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు జావాబుదారీ పాలన అందిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు జర్దారీ దేశాన్ని అధోగతిపాలుచేశారని ఆయన ధ్వజమెత్తారు. ‘నూతన పాకిస్తాన్ ఆవిష్కరణ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనానికి మేం పెద్ద పీట వేస్తున్నాం’అని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కృష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో భారత్‌లో మొఘలుల పాలన అంశం చోటుచేసుకుంది. ‘్భరత్‌లో ఒప్పుడు ఓ వెలుగువెలిగిన మొఘల్ సామ్రాజ్యం ఎందుకు తెరమరుగైంది? ఎందరో గొప్ప పాలకులు మొఘల్ సామ్రాజ్యాన్ని ఏలారు. చివరికి ఔరంగజేబులాంటి అసమర్ధ పాలకుడు వచ్చాక అధోగతి పాలైంది’అని ఆయన వివరించారు. మొఘలుల పాలనలో భారత్ వెలిగిపోయిందన్నారు. 150 ఏళ్ల వారి పాలనలో భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే 25 శాతం ఉండేదని ఖాన్ తెలిపారు. ఔరంగజేబు తరువాత వచ్చిన పాలకులందరూ చేతగాని వారే కావడంతో పతనావస్థకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రతిపక్షాలు మొఘల్ సామ్రాజ్య పతనాన్ని చూసైనా నేర్చుకోవాలని హితవుచెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యేనాటికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి ఖాన్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా, చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. అలాగే 2018లోనే ఐఎంఎఫ్‌ను రుణం కోసం ఆశ్రయించారు. ఈనెలలోనే ఆరు బిలియన్ డాలర్ల రుణ సహాయం చేయడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆమోదం తెలిపింది. చైనాలో కమ్యూనిస్టుపార్టీ ప్రభుత్వ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. కష్టపడే నాయకులను చైనా ప్రజలు గుర్తిస్తారని ఆయన తెలిపారు. అందుకే ప్రపంచంలోనే చైనా అగ్రరాజ్యంగా తయారైందని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కాగా దేశంలో అవినీతి విచ్చలవిడిగ పెరిగిపోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలువురు తన దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు.