అంతర్జాతీయం

నేరస్థులకు ఏసీ గదులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 22: దేశంలో అవినీతి పెచ్చుపెరిగిపోవడం, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవ్వడానికి రెండు ప్రధాన ప్రతిపక్షాలే కారణమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నియంతలా పాలించారని, జర్దారీ, ఆయన కుమారుడు బిలావల్ భుట్టో చేతగాని, చేవలేని పాలకులని ఆయన విరుచుకుపడ్డారు. నవాజ్ షరీఫ్ జైలు జీవితంపై ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులకు ఏసీ గదులు, టీవీలు అవసరమా? అని ప్రధాని ప్రశ్నించారు. జైలులో ఏసీ గదులు కేటాయించి, ఇంటి నుంచి భోజనం తెచ్చుకోడానికి షరీఫ్‌కు అవకాశం కల్పించారని ఆయన మండిపడ్డారు. ‘నేను స్వదేశానికి తిరిగి వెళ్లాక వాటిని కట్ చేస్తా’అని పాక్ ప్రధాని వెల్లడించారు. నవాజ్‌కు ఏసీలు, టీవీలు ఉండబోవని ఆయన అన్నారు. ‘మరియం బీబీ(నవాజ్ కుమార్తె) గొంతు చించుకుకుని మాట్లాడుతున్నారు. నేను ఆమెకు ఒకటే చెబుతున్నా. దోచుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయండి. సమస్యలు పరిష్కారమవుతాయి’అని ఖాన్ పేర్కొన్నారు.ఇక జర్దారీ జైలుకెళ్లిన ప్రతిసారీ అనారోగ్యం పాలవుతారని ఎద్దేవా చేశారు. జైలుకెళ్లడం అనారోగ్యం సాకుతో ఆసుపత్రితో చేరిపోవడం మామూలైపోయిందని ఆయన విమర్శించారు. జర్దారీ ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడుస్తోందని ఇమ్రాన్ చలోక్తి విసిరారు. ఇక నుంచి ఇలాంటివి సాగవని, తాను స్వదేశం వెళ్లాక చూస్తానని వెల్లడించారు. తన ప్రభుత్వం అవినీతి రహితమైన స్వచ్ఛమైన పాలన అందిస్తుందని పాక్ ప్రధాని భరోసా ఇచ్చారు.