అంతర్జాతీయం

ఆరు నెలల ముందే రెన్యువల్ చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జూలై 23: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న భారతీయులు తమ పాస్‌పోర్టులను ఆరు నెలలు ముందుగానే రెన్యూవల్ చేసుకోవాలని, దానివల్ల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగేలా చూసుకోవచ్చని గల్ఫ్‌లోని ఇండియన్ ఎంబసీ సూచించినట్టు మంగళవారం ఒక మీడియా కథనం వెల్లడించింది. వేసవి సెలవుల్లో ప్రయాణం చేయడం కోసం ఆరు నెలల ముందుగానే రెన్యూవల్ చేసుకోవడం సౌలభ్యంగా ఉంటుందని ఇండియన్ ఎంబసీ సూచించినట్టు ‘ద గల్ఫ్ న్యూస్’ తెలిపింది.
‘మీ పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువును, మీ ట్రావెల్ డాక్యుమెంట్‌లో ఖాళీగా ఉన్న పేజీల సంఖ్యను, యూఏఈ రెసిడెన్స్ వీసా కాల పరిమితిని తనిఖీ చేసుకోండి’ అని అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ ఎం. రాజమురుగన్ సూచించారు. అధికారుల కథనం ప్రకారం, కొంతమంది భారతీయులు తమ పాస్‌పోర్టుల గడువు ముగిసిన తరువాత లేదా ట్రావెల్ డాక్యుమెంట్‌లో ఖాళీ పేజీల కొరత ఏర్పడిన తరువాత వాటిని రెన్యూవల్ చేయవలసిందిగా కోరుతూ ఎంబసీకి వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి.
‘యూఏఈలోని బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ సర్వీసెస్‌ను పాస్‌పోర్ట్‌లు జారీ చేయవలసిందిగా మేము ఆదేశించాం. మీరు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పుడయినా, ఎప్పుడయినా తనిఖీ చేసుకోవడం వల్ల చాలా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు’ అని రాజమురుగన్ ప్రజలకు సూచించారు. ప్రయాణం చేయడానికి అరు నెలల ముందుగానే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన సూచించారు.