అంతర్జాతీయం

భారత్-అమెరికా సంబంధాలకు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 23: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించవలసిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన భారత్, అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందా? కొంతమంది మాజీ దౌత్యవేత్తలు దీనికి అవుననే సమాధానమే ఇస్తున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అయితే, ట్రంప్ చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పాకిస్తాన్‌తో ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనేది భారత్ చాలాకాలంగా అనుసరిస్తున్న స్థిరమయిన వైఖరి అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘అమెరికా అధ్యక్షుడు ఈ రోజు చాలా నష్టం చేకూర్చారు. ఆయన కాశ్మీర్, అఫ్గానిస్తాన్‌లపై చేసిన ప్రకటన సరికాదు’ అని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు త్వరలోనే దక్షిణాసియా అంశాలలోని సంక్లిష్టతను తెలుసుకుంటారు’ అని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కాని పేర్కొన్నారు. ‘అధ్యక్షుడు ట్రంప్ అఫ్గానిస్తాన్‌పై ఒప్పందం కుదుర్చుకోవడానికి పాకిస్తాన్ సహాయాన్ని కోరుతున్నారు. పాకిస్తాన్ ఏమి కోరుకుంటోందని ట్రంప్ అనుకున్నారో దానిని పాకిస్తాన్‌కు ఆశ చూపారు’ అని హక్కాని అన్నారు. ‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ప్రశంసించినట్లుగానే ఆయన ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశంసించారు. ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయన అనుసరించే ప్రామాణిక విధానమిది’ అని హక్కాని పేర్కొన్నారు. ‘కొరియా ద్వీపకల్పంపై ఆయన ఎలాగయితే ఒప్పందం కుదుర్చుకోలేక పోయారో, అలాగే ఆయన త్వరలోనే ఒక స్థిరాస్తి ఒప్పందం కుదుర్చుకోవడం కన్నా దక్షిణాసియా చారిత్రక వివాదాలు చాలా సంక్లిష్టమయినవనే విషయాన్ని తెలుసుకుంటారు’ అని హక్కాని అన్నారు.