అంతర్జాతీయం

బ్రిటన్ కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 23: నెల రోజులుగా బ్రిటన్ ప్రధాని ఎవరన్న దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ దేశ ప్రధానిగా థెరిసా మే స్థానంలో ఎన్నికయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రిటన్ రాజకీయాలను బ్రెగ్జిట్ వ్యవహారం వేడెక్కిస్తున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి థెరిసా మే అనివార్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కన్సర్వేటివ్ పార్టీలోనే ఆమెకు వ్యతిరేకత పెరిగిపోవడంతో కొత్త ప్రధానిని ఎన్నుకోవడం అన్నది అనివార్యమైంది. కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన అనంతరం మాట్లాడిన జాన్సన్ బ్రిటన్‌ను మరింత శక్తివంతంగా మారుస్తానని.. అలాగే ఐరోపా యూనియన్ నుంచి వైదొలగనున్న బ్రిటన్‌కు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. బ్రిటన్ రాజకీయాల్లో ఎప్పుడు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డా వాటిని అధిగమించే విషయంలో కన్సర్వేటివ్ పార్టీపైనే ప్రజలు దృష్టి సారించారని ఆయన అన్నారు. బ్రిటన్ చరిత్రలో బ్రెగ్జిట్ వ్యవహారం ఒక కీలక పరిణామమని, దేశ సమైక్యతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ సమస్యను గట్టెక్కుతానని ఆయన తెలిపారు. వెంటనే తన లక్ష్యసాధన దిశగా ప్రయత్నాలు చేయపడతానని కూడా ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలో జాన్సన్‌కు 92,153 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీచేసిన మరో అభ్యర్థి హంట్‌కు 46,656 ఓట్లు వచ్చాయి. మొత్తం 1,59,320 కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ ప్రతిపదికగా ఈ ఎన్నిక జరిగింది. 509 ఓట్లను తిరస్కరించారు. ఈ ఎన్నికలో మొత్తం 87.4 శాతం మంది పాల్గొన్నారని, మొదటినుంచీ కూడా ఆయన ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా జాన్సన్ ఏర్పాటు చేసే కొత్త మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన ఎంపీలు ప్రీతి పటేల్, రిషీ సునక్‌లకు స్థానం లభించే అవకాశం కనిపిస్తోంది. కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా, దేశ ప్రధానిగా జాన్సన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దేశ భవితకు మరింత బలం చేకూరుతుందని.. ముఖ్యంగా బ్రెగ్జిట్ విషయంలో సరైన నిర్ణయంతోనే ఆయన ముందుకు వెళ్లగలరన్న ధీమాను ప్రీతి పటేల్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా గణనీయంగా మెరుగయ్యే అవకాశాలున్నాయని అన్నారు.