అంతర్జాతీయం

మందులకు లొంగని ‘మలేరియా జీవులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 23: యాంటీ మలేరియా ఔషధాలను తట్టుకునే నిరోధక శక్తి ఈ వ్యాధికి కారణమయిన పరాన్నజీవుల్లో వేగంగా వృద్ధి చెందుతోంది. ప్లాస్మోడియం పరాన్నజీవుల కారణంగా మలేరియా వ్యాధి వస్తుంది. దోమల నుంచి ఈ ప్లాస్మోడియం పరాన్నజీవులు మనుషులకు వ్యాపిస్తాయి. కాంబోడియా నుంచి పొరుగున గల ఆగ్నేయాసియా దేశాల వరకు స్థానిక పరాన్నజీవుల్లో ఫస్ట్-లైన్ యాంటీ మలేరియా ఔషధాలను తట్టుకునే నిరోధక శక్తి వేగంగా విస్తరిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘ద లానె్సట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్’లో ఈ అధ్యయనం ప్రచురితమయింది. వియత్నాం, లావోస్, నైరుతి థాయిలాండ్‌లలోని స్థానిక పరాన్నజీవుల్లో యాంటీ మలేరియా ఔషధాలను తట్టుకునే శక్తి వేగంగా విస్తరిస్తోందని బ్రిటన్‌లోని వెల్‌కమ్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటి ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. యాంటీ మలేరియా ఔషధాలను తట్టుకునే శక్తి పెరగడం వల్ల ఆ పరాన్నజీవుల్లో జన్యుపరమయిన మార్పులు కూడా సంభవిస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.