అంతర్జాతీయం

2020 మేలో నీరవ్ అప్పగింతపై ఐదు రోజుల ప్రత్యేక విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 25: లండన్‌కు పారిపోయి అక్కడి జైళ్లలో మగ్గుతున్న ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీకి గురువారం లండన్ న్యాయ స్థానంలో చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 2 బిలియన్ డాలర్లమేర మోసగించడంతోబాటు, మనీల్యాండరింగ్ కేసులో సైతం అభియోగాలను నీరవ్‌మోదీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా గురువారం జైలు నుంచే వీడియో లింక్ అప్పియరెన్స్ ద్వారా విచారణను ఎదుర్కొన్న నీరవ్ మోదీ రిమాండ్‌ను ఆగస్టు 22వరకు పొడిగించిన న్యాయస్థానం జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. మళ్లీ 22న అతను ఇదే రీతిలో విచారణను ఎదుర్కోవాలని వెస్ట్‌మినిస్టర్స్ మేజిస్ట్రేట్స్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ ఆదేశించారు. కాగా 2020 మే నెలలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయంపై ఐదురోజుల పాటు ట్రయల్ (విచారణ) జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఇరుదేశాలు కలిసి చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం తేదీలను ఖరారు చేయడం జరుగుతుందని న్యాయమూర్తి ఎమ్మా సంకేతాలివ్వడం విశేషం. బహుశా వచ్చే 22వ తేదీ నాటికే తేదీలు ఖరారయ్యే అవకాశాలున్నాయని న్యాయమూర్తి నిందితుడు నీరవ్ మోదీతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలనుబట్టి అవగతమైంది. బూడిద రంగు టీషర్టు ధరించిన నీరవ్‌మోదీ ఈ సందర్భంగా ఉల్లాసంగా కనిపించాడు. గత మార్చి నెలలో అరెస్టయినప్పటి నుంచి అతను ఇక్కడి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
‘అతనికి వాండ్స్‌వర్త్ జైలు మరీ వేడెక్కించేదిగా ఉండకపోవచ్చనుకుంటున్నాన’ని న్యాయమర్తి ఎమ్మా వ్యాఖ్యానించినపుడు నీరవ్ నవ్వుతూ ‘ఫైన్ థ్యాంక్యూ మామ్’ అని స్పందించాడు. అతని తరపున వాదిస్తున్న డిఫెన్స్ బృందం నుంచి బారిస్టర్ జెస్సికా జోన్స్ కోర్టుకు హాజరయ్యారు. అలాగే భారత ప్రభుత్వం తరపున ఈ కేసును ‘క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) వాదిస్తోంది.