అంతర్జాతీయం

మమ్మల్ని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 16: పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తమను విముక్తం చేయాలంటూ బలూచిస్తాన్ ప్రజలు అంతర్జాతీయ మద్దతు కోసం పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తం నేపథ్యంలో బలూచ్ ప్రజలు ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల మద్దతు కోరుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమను అణచివేస్తోందని, దానినుంచి తమను రక్షించాలని అభ్యర్థించారు. మత ఉగ్రవాదాన్ని పాక్ ప్రభుత్వం ఓ విధానంగా అవలంబిస్తోందని దీనివల్ల చాలా తీవ్రస్థాయిలోనే పర్యవసానాలు ఉంటాయని బలూచ్ జాతీయ ఉద్యమ నాయకుడు ఖలీల్ బలోచ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయినా దాన్ని అణచివేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. బలూచిస్తాన్‌లో పాక్ చేపడుతున్న అమానుష చర్యలను నిరోధించడానికి భారతతో కలిసి పనిచేయాలని అమెరికా, ఐరోపాలకు ఆయన పిలుపునిచ్చారు. 68 ఏళ్లుగా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న బలూచిస్తాన్‌లో ఎన్నో అరాచకాలు జరిగాయని వెల్లడించారు. ఇప్పటికే స్వేచ్ఛకోసం పాకిస్తాన్‌తో ఐదు యుద్ధాలు చేశామని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ పరిస్థితిని అర్థం చేసుకుని మద్దతు ఇవ్వడం నైతికంగా తమకెంతో బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.