అంతర్జాతీయం

శ్రీలంక నేవీ అదుపులో భారత మత్స్యకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 25: శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన నలుగురు భారత మత్స్యకారులను అక్కడి నేవీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటి చేపల వేట సాగిస్తున్న వీరిని కోవిలం లైట్ హౌస్ వద్ద బుధవారం అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన ఈ నలుగురు మత్స్యకారులు సరిహద్దు నిబంధననలు ఉల్లంఘించి చేపలవేట సాగిస్తున్నందునే లంక నేవీ అదుపులోకి తీసుకొన్నట్లు కొలంబో పేజ్ పేర్కొంది. మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోట్‌ను స్వాధీనం చేసుకొని జాఫ్నా అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మత్స్యకారులను జాఫ్నా మత్స్యశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు సమాచారం. లంక నేవీ విభాగం తరచు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ కారణంగా శ్రీలంక జలాల్లోకి ప్రవేశించే భారత మత్స్యకారుల సంఖ్య బాగా తగ్గిందని లంక నేవీ మీడియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.