అంతర్జాతీయం

కాశ్మీరీల పోరాటానికి మద్దతు కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 16: కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన అవసరముందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అక్కడి ప్రజలు జరుపుతున్న స్వాతంత్య్ర పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ అధ్యక్షుడు సర్దార్ మహమ్మద్ యాకూబ్ ఖాన్‌ను కలిసినప్పుడు షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలు జరుపుతున్న స్వాతంత్య్ర పోరాటానికి తమ ప్రభుత్వంనుంచి నైతికంగా, దౌత్యపరంగా, రాజకీయంగా పూర్తిస్థాయి మద్దతు కొనసాగుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ తిరుగులేని హక్కయిన స్వాతంత్య్రాన్ని సాధించుకోవడం కోసం కాశ్మీరీలు పెద్ద సంఖ్యలో బలిదానాలు చేస్తున్నారని, నిరాయుధులైన అమాయక ప్రజలపై తాజాగా చోటుచేసుకున్న క్రూర సంఘటనలను ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని షరీఫ్ అన్నారు. తన పదవీ కాలంలో సామరస్యపూర్వకంగా పరిపాలన సాగించినందుకు యాకూబ్‌ఖాన్‌ను ఆయన అభినందించారు కూడా. ఎన్నికల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగడం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. షరీఫ్ ఇప్పటికే రజా ఫరూక్ హైదర్‌ను పిఓకె ప్రధానమంత్రిగా, మసూద్ ఖాన్‌ను అధ్యక్షుడిగా నియమించారు కూడా. ఈ ఇద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందినవారే. హైదర్ తలపండిన రాజకీయవేత్త కాగా, ఖాన్ వృత్తిపరంగా దౌత్యవేత్త. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా, చైనాలో పాక్ రాయబారిగా, ఐక్యరాజ్య సమితిలో పాక్ శాశ్వత ప్రతినిధిగా కూడా ఆయన పని చేశారు. కాగా, మంగళవారం సమావేశమైన ఆజాద్ జమ్మూ, కాశ్మీర్ (పిఓకె) అసెంబ్లీ ముజఫరాబాద్‌లో సమావేశమై ఖాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కొత్త అధ్యక్షుడు ఖాన్‌ను షరీఫ్ నామినేట్ చేసినప్పటికీ ఆయనకు పాక్ సైన్యం మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు.