అంతర్జాతీయం

పాక్‌లో కుప్పకూలిన ఆర్మీ శిక్షణ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 30: పాక్ ఆర్మీ విమానం కుప్పకూలి 18మంది దుర్మరణం చెందారు. రావల్‌పిండి సమీపంలో మంగళవారం తెల్లవారు ఝామున ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు పాక్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. పాక్‌కు చెందిన చిన్నపాటి శిక్షణ విమానం అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నర నుంచి 2.40 గంటల మధ్యలో రావల్‌పిండి శివారులోని మోరాకలు గ్రామం వద్ద ఈ ఘటన జరిగినట్లు పాక్ అధికార వర్గాల సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు సిబ్బంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో 13మంది పౌరులు కూడా మృతిచెందారు. పాక్ ఆర్మీ బలగాలు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలంలో మృతిచెందిన ఐదుగురు సిబ్బందితో పాటు 13మంది పౌరులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విమానం కుప్పకూలిన ఘటనలో మరో 12 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. రావల్‌పిండిలోని బహ్రియా పట్టణం సమీపంలో జరిగిన ఈ ఘటనతో కనీసం ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విమాన ప్రమాదంలో 18మంది మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, 2016లో పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో 48మంది మరణించగా.. 2012లో భోజా ఎయిర్‌లైన్ విమానం కూలిన ఘటనలో 121మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది దుర్మరణం చెందారు. 2010లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనలో ఏకంగా 321మంది మరణించారు.