అంతర్జాతీయం

పాక్‌కు చేరుకున్న 500 మంది భారతీయ సిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్: సిక్కు వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 500 మంది సిక్కులు మంగళవారంనాడు పాక్‌కు చేరుకున్నారు. అయితే, భారత్ నుంచి వచ్చిన సిక్కు యాత్రీకులు ఉండే ప్రాంతాన్ని కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు సైతం పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం లేదు. అయితే, పాకిస్తాన్ విదేశీ కార్యాలయం మాత్రం చాలాసేపటి తర్వాత భారత్ నుంచి ఇక్కడకు వస్తున్న 500 మంది సిక్కుల రాక గురించి ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే, వారంతా కర్తార్‌పూర్ కారిడార్ లేదా వాఘా సరిహద్దులను దాటి వచ్చారా? లేదా? అన్న అంశంపై సరైన వివరణ ఇవ్వలేదు. కానీ సంబంధిత వర్గాలు పీటీఐ ప్రతినిధికి తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌కు చెందిన సిక్కులు వాఘా సరిహద్దు మీదుగా పాక్‌కు చేరుకున్నారన్నారు. ఈటీపీబీ, పీఎస్‌జీపీసీ అధికారులు మాత్రం భారత్‌కు చెందిన 500 మంది సిక్కులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా రావడంతో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 500 మంది భారత సిక్కులు నంకనా సాహిబ్‌ను చేరుకోవడానికి మంగళవారం ఉదయం వచ్చారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సిక్కు పర్యాటకులంతా ఆగస్టు 1న పాకిస్తాన్‌లో బాబా గురునానక్ జన్మస్థలమైన నంకనా సాహిబ్‌లో జరిగే 550 జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.