అంతర్జాతీయం

ప్రభుత్వ విధానాలే బలి తీసుకున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ప్రభుత్వ విధానాలే కారణమని కింగ్‌ఫిషన్ మాజీ చీఫ్ విజయ్‌మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలు, నిరంతర వేధింపులు ఓ సమర్ధుడైన పారిశ్రామికవేత్తను బలితీసుకున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 59 ఏళ్ల కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆర్థికపరమైన సమస్యలతో బలవన్మరణం పొందారు. రెండు రోజుల క్రితం నదిలో దూకేసిన ఆయన మృతదేహాన్ని బుధవారం పోలీసులు కనుగొన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగవేసి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా(63) లండలో తలదాచుకుంటున్నారు. కేఫ్ కాఫీ డే చీఫ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విధానాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదా మద్దతు లభించడం లేదని మాల్యా మండిపడ్డారు. ‘ వీజీ సిద్ధార్థతో నాకు మంచి పరిచయమే ఉంది. మంచి మానవతావాది. అలాగే బ్రిలియంట్ పారిశ్రామిక వేత్త. సిద్ధార్థ లేఖ నన్ను ఎంతో ఆవేదనకు గురిచేసింది’అని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు కాల్చుకుతింటున్నాయి. పారిశ్రామిక వేత్తలకు ఆనందం లేకుండా చేస్తున్నాయి. నా సంగతే చూడంది. బకాయిలు మొత్తం చెల్లిస్తానని ముందుకొచ్చినా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి’అని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సిద్ధార్థ రాసిన లేఖ కారులో దొరికింది. ఆదాయపన్నుశాఖ వేధింపులు ఎక్కువయ్యాయని ఆయనా లేఖలో ఆవేదన చెందారు. కాగా భారత్ ప్రభుత్వంపై విజయ్ మాల్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ భారత్‌లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోదు. అయితే పాశ్చాత్య దేశాల్లో దీనికి భిన్నమైన పరిస్థితులున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్తలకు రుణాలు తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం కాస్త ఉదారంగా ఉంటుంది’అని ఆయన వెల్లడించారు. ‘నా విషయమే తీసుకోండి. రుణాలు తిరిగి చెల్లిస్తానన్నా ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. బ్యాంకుల సంగతి సరేసరి’అని లిక్కర్ కింగ్ పేర్కొన్నారు.

చిత్రం... కింగ్‌ఫిషన్ మాజీ చీఫ్ విజయ్‌మాల్యా