అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో కార్మిక కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జూలై 31: ఆస్ట్రేలియాలో కార్మిక కొరతను ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల కొరతను అధిగమించేందుకు ‘వర్కింగ్ హాలిడే మేకర్’ వీసాను ప్రభుత్వం తీసుకొచ్చింది. భారత్ సహా 12 దేశాల నుంచి ముఖ్యంగా వ్యవసాయ కార్మికులను ఆస్ట్రేలియాకు రప్పించేందుకు వీలుగా వర్కింగ్ హాలిడే వీసాను ప్రవేశపెట్టినట్లు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ హాలిడే మంత్రి డేవిడ్ కోల్‌మేన్ బుధవారం వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో నెలకొన్న కార్మిక కొరతను అధిగమించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. వర్కింగ్ హాలిడే మేకర్ కార్యక్రమంతో చేపట్టిన వర్కింగ్ హాలిడే, వర్క్ అండ్ హాలిడే వీసాల నేపథ్యంలో 13 దేశాల నుంచి స్వల్పకాలిక వ్యవధిలో ఆస్ట్రేలియాలో ఉపాధి పొందేందుకు అవకాశాలుంటాయని మంత్రి వివరించారు. ఎంపిక చేసిన దేశాల్లో భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, స్విడ్జర్లాండ్, ఫిజీ, సొలొమన్ దీవులు, క్రోషియా, లాట్వియా, లూథియానా, అండొర్రా, మొనాకో, మంగోలియా ఉన్నాయి. వర్కింగ్ హాలిడే వీసా నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ సమాచారం ఇచ్చింది.