అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌ను వణికిస్తున్న డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 31: బంగ్లాదేశ్ ఇప్పుడు డెంగ్యూ వ్యాధితో వణికిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వేలాది మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఆసుపత్రుల బాట పట్టారు. ఇప్పటికే ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజారోగ్య వ్యవస్థపై ఇప్పుడు డెంగ్యూ వ్యాధి మోయలేని భారంగా పరిణమించింది. ఒక రకమయిన దోమల నుంచి సోకే ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ దేశంలోని 64 జిల్లాలకు గాను 61 జిల్లాలకు వ్యాపించినట్టు మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం వెల్లడిస్తోంది. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి 15,369 డెంగ్యూ కేసులు నమోదయినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. జూలై ఒకటో తేదీ నుంచి జూలై 30వ తేదీ మధ్యనే 9,683 మంది రోగులకు డెంగ్యూ వ్యాధి సోకినట్టు నిర్ధారించడం జరిగిందని వివరించింది. మంగళవారం నాటికి అనేక మంది చిన్నారులు సహా మొత్తం 4,400 మంది డెంగ్యూ రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది రోగులు డెంగ్యూ వ్యాధి కారణంగా మృతి చెందారు. ఈ వ్యాధి మొదలయిన దేశ రాజధాని ఢాకాలో అధికారులు దీనిని నియంత్రించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. జనసమ్మర్ధం గల ఢాకాలో ఇప్పుడు ఈ వ్యాధి అనేక మందిని వణికిస్తోంది. డెంగ్యూ వ్యాధి ఒక రకమయిన దోమల ద్వారా విస్తరిస్తుంది. ఢాకా నగరం నుంచి అనేక మంది ప్రజలు వచ్చే నెలలో ఈద్-ఉల్-ఆధాను జరుపుకోవడానికి వారి వారి స్వంత గ్రామాలకు వెళ్లనున్నారు. దీనివల్ల డెంగ్యూ వ్యాధి గ్రస్తుల నుంచి ఇన్‌ఫెక్షన్ సోకని దోమలకు కూడా ఇది సోకుతుందని, వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర మనుషులకు డెంగ్యూ వ్యాపిస్తుందని, ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత భయానకంగా తయారవుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో 2000వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది వర్షాకాలంతో పాటు డెంగ్యూ వ్యాధి వస్తోందని, కాని ఈ సంవత్సరం ఈ వ్యాధి ప్రభావం భయానకంగా ఉందని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) అసిస్టెంట్ డైరెక్టర్ ఆయేషా అఖ్తర్ తెలిపారు.