అంతర్జాతీయం

అన్యాయం.. ఏకపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్ : జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్ర పదజాలంతో మండిపడింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ అన్యాయ, ఏకపక్ష చర్యను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తించిన వివాదాస్పద ప్రాంతమని, దీనిపై భారత ప్రభుత్వం ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్య సమితి తీర్మానంలోనే ఈ అంశం స్పష్టంగా ఉందని పేర్కొంది. పైగా, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం తమకు గానీ, కాశ్మీర్ ప్రజలకు గానీ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది. ఈ అంతర్జాతీయ వివాదంలో పాకిస్తాన్ భాగస్వామ్య పక్షంగా ఉందని, భారత్ చర్యను రాజకీయంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని, అలాగే కాశ్మీర్ ప్రజలకు ఉన్న స్వయం నిర్ణయాధికార హక్కును సాధించుకోవడంలో వారికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై వౌనంగా ఉండడానికి వీల్లేదని, ఐక్యరాజ్య సమితిని, ఇస్లాం దేశ సహకార మండలిని, మిత్ర దేశాలను, మానవ హక్కుల సంస్థలను కోరతామని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధుల బృందానికి కూడా తమ వైఖరిని స్పష్టం చేస్తామని, అలాగే ప్రపంచ దేశాలకు భారత్ చర్యలోని అన్యాయాన్ని వెల్లడిస్తామని ఆయన అన్నారు. గతంలో కంటే కూడా కాశ్మీర్‌లో పరిస్థితి ప్రస్తుతం చాలా ఆందోళనకంగా, తీవ్రంగా ఉందని, ఇందుకు సంబంధించి న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాశ్మీర్ హోదాను మార్చడం ద్వారా ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన హామీని భారత్ ఉల్లంఘించిందని ఖురేషీ అన్నారు. పైగా భారత్ చర్య న్యాయపరంగా లేదా రాజ్యాంగపరంగా ఎంతమాత్రం చెల్లదని ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని భారత్ ఎంతమాత్రం మార్చజాలదని తాజా నిర్ణయం ద్వారా కాశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా మార్చిందని ఖురేషీ తెలిపారు. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో ఎన్నో తీర్మానాలు ఉన్నాయని, ఆ తీర్మానాలన్నింటిలోనూ కాశ్మీర్‌ను వివాదాస్పదంగా గుర్తించడం జరిగిందని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజలకు తమ మద్దతు ఎంతమాత్రం ఆగదని, భారత్ నిర్ణయం ఎంతమాత్రం సరైనది కాదన్న విషయాన్ని చరిత్రే రుజువు చేస్తుందని ఆయన అన్నారు.
నేడు పార్లమెంటు భేటీ
కాశ్మీర్ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ మంగళవారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆధీనరేఖ ప్రాంతంలోను, కాశ్మీర్‌లోనూ నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
అలాగే భారత్ చర్య పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని కోరబోతోంది.