అంతర్జాతీయం

కాశ్మీర్ కాదు.. ఉగ్రవాదంపై మాట్లాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 17: కాశ్మీర్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి ప్రతిపాదనపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ స్పందిస్తూ కాశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని, దానిపై ఎవరితోనూ చర్చించాల్సిన పరిస్థితి లేదని, రాదని స్పష్టం చేశారు.
‘నేను పాకిస్తాన్‌కు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నా. సరిహద్దు తీవ్రవాదం, చొరబాట్లకు ముగింపు పలకడంపై చర్చిస్తాం’ అంటూ సందేశం పంపించారు. భారత్ సమాధానాన్ని పాక్‌లో భారత హైకమిషనర్ ఆ దేశ విదేశాంగ శాఖకు అందించారు. ‘‘జమ్ము కాశ్మీర్‌పై ఇష్టం వచ్చినట్లు చేస్తున్న అన్ని ఆరోపణలను ఖండిస్తున్నాం. కాశ్మీర్ విషయంలో మాట్లాడేందుకు పాకిస్తాన్‌కు ఎలాంటి అధికారం లేదు. ఇది భారత్ అంతర్గత వ్యవహారం.’ అని భారత్ ఘాటుగా జవాబిచ్చింది. కాశ్మీర్ అంశంపై చర్చించటం ఒక అంతర్జాతీయ అవసరమని, కాబట్టి, ఆ అంశంపై చర్చించేందుకు రావలసిందిగా పాకిస్తాన్ సోమవారం భారత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
పాకిస్తాన్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ భారత్‌పాక్‌ల మధ్య సమకాలీన, సందర్భోచితమైన అంశాలపై చర్చలకు సిద్ధమంటూ భారత్ పేర్కొందనీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య తక్షణం చర్చించాల్సిన అంశం కాశ్మీరేనని స్పష్టం చేశారు. దీనికి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ దీటైన జవాబే ఇచ్చారు. భారత్ తాను అన్న మాటకు కట్టుబడి ఉందని, సమకాలీన సందర్భోచితమైన అంశాలంటే అంశాలపై చర్చించటానికి భారత్ సిద్ధంగా ఉందని, ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాల్లో తక్షణం చర్చించాల్సింది సరిహద్దు తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతివ్వటాన్ని ఆపేయటం, బహదూర్ అలీ లాంటి టెర్రరిస్టులను భారత్‌లోకి చొరబడకుండా చేయటం అన్నదే కీలకమని స్పష్టం చేశారు. ‘‘సరిహద్దు వెంట ఉగ్రవాదాన్ని తక్షణం ఆపేయాలి, అంతర్జాతీయంగా ఉగ్రవాదులుగా ముద్రలు పడ్డ హఫీజ్ సరుూద్, సయ్యద్ సలాహుద్దీన్ లాంటి వాళ్లను కట్టడి చేయాలి, ముంబై దాడులు, పఠాన్‌కోట్ దాడులపై నిజాయితీగా విచారణ చేయాలి’’ అని వికాస్ స్వరూప్ స్పష్టంచేశారు.

చిత్రం.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్