అంతర్జాతీయం

యథాతథ స్థితి మార్చొద్దు: చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: ప్రస్తుత ఉద్రిక్తతలను మరింతగా ఎగదోయకుండా భారత్-పాకిస్తాన్ సంయమనం పాటించాలని చైనా మంగళవారం విజ్ఞప్తి చేసింది. కాశ్మీర్‌కు సంబంధించి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ఎలాంటి ప్రయత్నాలకు ఒడిగట్టకూడదని స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన చైనా ఈ విషయంలో మొదటినుంచీ తాము ఒకే వైఖరిని కొనసాగిస్తున్నామని తెలిపింది. కాశ్మీర్ అంశం అన్నది భారత్-పాక్‌లకు వారసత్వంగా వస్తున్న చారిత్రక సమస్య అని, ప్రపంచ దేశాలు కూడా ఈ అంశంపై ఏకాభిప్రాయంతో ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునీంగ్ తెలిపారు. ఆధీనరేఖ ప్రాంతంలో తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడం, ఎదురుకాల్పుల ఘటనలు జరగడం, అలాగే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 రాజ్యాంగ అధికరణను భారత్ రద్దు చేయడం వంటి అనేక అంశాలని ఆమె మాట్లాడారు. భారత్-పాక్‌లు శాంతియుతంగా చర్చలు, సంప్రతింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, దక్షిణాసియా ప్రాంత శాంతి, సుస్థిరతలకు ఎలాంటి విఘాతం కలుగనీయకూడదని ఆమె తెలిపారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ప్రకటించడంపై కూడా చైనా స్పందించింది. భారత్-చైనా సరిహద్దు పశ్చిమ భాగంలోని చైనా భూభాగాన్ని భారత్ కలుపుకుపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఇదే వైఖరిని తాము స్థిరంగా, నిలకడగా కొనసాగిస్తున్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని ఉద్ఘాటించారు.