అంతర్జాతీయం

పుల్వామా తరహా దాడులకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 6: జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు కావడంతో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇరు దేశాల మధ్య ఎడతెగని సంఘర్షణ తలెత్తే అవకాశం ఉందని పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభలనుద్ధేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ తరహా యుద్ధం వల్ల అంతిమ విజయం ఎవరికీ ఉండదనీ, కానీ దీని పర్యావసనాలు అంతర్జాతీయంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకంగా కాశ్మీర్ పరిస్థితి గురించి చర్చించేందుకే పార్లమెంటు ఉభయ సభలూ సమావేశమయ్యాయి.
ఈ పరిణామాల తీవ్రత వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తలపించే రీతిలో సంఘర్షణ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని కాశ్మీర్ ప్రజలు అంగీకరించే అవకాశం ఉండదని, వారిని అణచి వేసే చర్యలకు భారత్ పాల్పడేందుకు అవకాశం ఉందని ఇమ్రాన్ తెలిపారు. దీని దృష్ట్యా పుల్వామా తరహా దాడులు మళ్లీ జరిగే అవకాశం ఉందని, ఈ విషయాన్ని తాను చాలా స్పష్టంగా చెప్పగలనని అన్నారు. ఈ తరహా పరిస్థితులకు భారత్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను నిందిస్తున్నదని, తప్పంతా తమపైకి నెట్టి వేస్తున్నదని ఇమ్రాన్ అన్నారు. అంతేకాదు భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉందని, దానిని తిప్పికొట్టడమూ ఖాయమని ఆయన తెలిపారు. ఈ విధంగా రాబోయే పరిణామాలను, తలెత్తే పరిస్థితులను ఇమ్రాన్ వివరించారు. ఈ రకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, దాని పర్యావసనాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని అన్నారు. కాశ్మీర్ పరిస్థితిపై దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. భారత్‌లో అధికార పార్టీ తమ సిద్ధాంతానికి అనుగుణంగానే పాక్‌పై నిర్ణయం తీసుకుందన్నారు. వారి జాత్యాంహకార సిద్ధాంతమని ధ్వజమెత్తారు. ఈ రకమైన సిద్ధాంతం వల్లే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ‘ప్రస్తుత పరిస్థితిపై ప్రపంచ దేశాలు వౌనం వహిస్తే తమ చట్టాలను ధృవీకరించే ప్రయత్నం చేయకపోతే వాటి పర్యావసనాలకు మేము ఎంత మాత్రం బాధ్యులం కాదు’ అని ఇమ్రాన్ తెలిపారు. కాశ్మీర్‌పై ప్రపంచ నాయకులను కలుస్తామని, పరిస్థితిని వివరిస్తామని ఆయన చెప్పారు. భద్రతా మండలి సహా అన్ని వేదికలపైనా భారత్ నిర్ణయాన్ని ఎండగడతామన్నారు. భారత్‌తో పాటు అన్ని దేశాలతోనూ సన్నిహిత సంబంధాలను తాము కోరుకుంటున్నప్పటికీ భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే తమ శాంతికామకతను భారత్ బలహీనతగా భావిస్తుందన్న అనుమానం కలుగుతుందన్నారు. అందుకే భారత్‌తో చర్చల ప్రయత్నాలను మానుకున్నామని తెలిపారు. భారత్‌కు తగిన జవాబు ఇవ్వాలంటూ ప్రతిపక్ష నాయకుడు షహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ ‘్భరత్‌పై దాడి చేయాలని మీరు కోరుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. భారత్ చర్యను గట్టిగా ప్రతిఘటించాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.