అంతర్జాతీయం

విమానంలో పుట్టిన పాపాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులు సాయపడి పురుడు పోయడంతో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వచ్చే అక్టోబర్‌లో డెలివరీ జరగాల్సి ఉండగా ముందుగనే కాన్పయింది. దుబాయినుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న సెబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిళ ప్రసవం కారణంగా ఆ విమానం హైదరాబాద్‌లో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. ఈ మొత్తం సంఘటనను మిస్సీ బెర్బెరాబే ఉమందాల్ అనే తోటి ప్రయాణికురాలు ఫేస్‌బుక్‌లో పంచుకుంది. పుట్టిన పసిబిడ్డకు ఎయిర్‌లైన్స్ పదిలక్షల గెట్ గో పాయింట్లు ఇచ్చిందని, అంటే ఆ పసిబిడ్డ తన జీవితకాలమంతా విమాన ప్రయాణాలన్నీ పైసా ఖర్చు చేయకుండా జరపడానికి అవసరమైనంత సొమ్ము ఆ పాయింట్ల ద్వారా లభిస్తుందని తెలిపింది. వాస్తవానికి ఆ బిడ్డ తల్లి మరో రెండు నెలల తర్వాత ప్రసవించాల్సి ఉంది. అయితే విమానంలో ప్రయాణిస్తుండగా హటాత్తుగా నొప్పులు రావడంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది సైతం గాబరా పడిపోయారు. అదృష్టవశాత్తు విమానంలో ఇద్దరు నర్సులు ఉండడంతో వారి సహాయంతో కాన్పు విజయవంతంగా పూర్తి చేశారు. నిజానికి విమాన సిబ్బంది మొత్తం విమానాన్ని తాత్కాలిక డెలివరీ రూమ్‌గా మార్చి చేశారు. కాన్పు జరగడానికి కొద్ది క్షణాల ముందు తల్లి పెట్టిన చిన్న పాటి కేక మాత్రమే వినిపించిందని, ఆతర్వాత కొద్ది సేపటికే క్యార్..క్యార్‌మన్న ఏడ్పు వినిపించింద, అప్పుడు బిడ్డ పుట్టిందనే విషయం తమకు అర్థమయిందని ఉమందాల్ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ జరగవని, సినిమాల్లో మాత్రమే మనం ఇలాంటి వాటిని చూస్తుంటామని ఆమె అంటూ, అయితే ఈ అద్భుతాన్ని చూసిన తామంతా ఎంతో అదృష్టవంతులమని పేర్కొం ది. విమానంలో చిన్న పిల్లలతో ఉన్న తల్లులు కొందరు ఉండడంతో పుట్టిన పసిబిడ్డకు బట్టలు, ఇతర అవసరమైన వస్తువులకు కూడా ఎలాంటి ఇబ్బందీ లేక పోయింది. బ్లాంకెట్‌లోచుట్టి తల్లి చేతుల్లో విశ్రాంతి తీసుకుంటున్న బుల్లి పాప ఫోటోను కూడా ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.