అంతర్జాతీయం

రెడ్‌లైన్.. దాటేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 18: తమ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతం గురించి ప్రస్తావించడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ రెడ్‌లైన్ దాటేశారని పాకిస్తాన్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తింది. గత ఏడాది జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీలో తమ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్‌లోని పరిస్థితులను గట్టిగా ప్రస్తావించారని, ఈసారి కూడా అంతకుమించిన తీవ్రతతోనే ఈ అంశాన్ని లేవనెత్తుతామని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం ఇక్కడ ప్రకటించారు. బలుచిస్తాన్ విషయంలో భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి, అలాగే బలూచిస్తాన్ ప్రజల అవస్థల గురించి మోదీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. మోదీ చేసిన వ్యాఖ్యలు ఐరాస చార్టర్‌కు విరుద్ధమని, ఆ విధంగా ఆయన రెడ్‌లైన్ అతిక్రమించారని జకారియా అన్నారు. బలూచిస్తాన్, కరాచీల్లో అనేక రకాలుగా విచ్ఛిన్నకర కార్యకలాపాలకు భారత్ ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఆయన ఆరోపించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టి మళ్లించడానికి బలూచిస్తాన్ అంశాన్ని భారత్ ప్రస్తావిస్తోందని అన్నారు.