అంతర్జాతీయం

మన ‘లస్సీ’... లండన్ ఖుషీ ఖుషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 11: శారీరక వేడిని తగ్గించే చల్లదనం...తాగుతున్న కొద్దీ మైమరిచిపోయే అనుభూతి...ఇదీ భారతీయ లస్సీకి ఉన్న ప్రత్యేకత. ప్రాంతం, భాష, సాంస్కృతికపరమైన తేడాలకు అతీతంగా భారతీయ లస్సీ యావత్ ప్రజానీకం ఆదరణ పొందుతోంది. ఎలాంటి వారిలోనైనా నోరూరించే భారతీయ వంటకాలను ఆస్వాదిస్తున్న విదేశీయులకు ఇప్పుడు ఈ లస్సీ అనుభూతి చేరబోతుంది. భారత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అక్కడి ప్రజలకు లస్సీని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లో నోరూరించే భారతీయ వంటకాలతో అలరిస్తున్న రెస్టారెంట్‌లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు భారతీయులకు ప్రత్యేకమైన లస్సీ కూడా యూకేకు చేరుకోవడంతో దీనికి అక్కడి ప్రజల నుంచి ఆదరణ ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది. భారతీయ ఔత్సాహికురాలు, రచయిత్రి, బర్డ్ గ్రూప్ ట్రావెల్ కంగ్లోమెరెట్ చైర్‌పర్సన్ రాధా బాటియా ‘లస్సీ ఆఫ్ ఇండియా - స్మూతీస్ విత్ ఏ ట్విస్ట్’ పుస్తకంలో రాశారు. లస్సీ తాగడం వల్ల శరీరంలో సామర్థ్యాన్ని పెంచి, ఇన్‌పెక్షన్‌ను తొలగిస్తుందని పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలో, సునాయసంగా జీర్ణం అవుతుందని ఆమె తెలిపారు. లస్సీలో వివిధ రకాల పండ్లు, మూలికలు, విటమిన్లు అధికంగా ఉండే నట్స్ కలుపుతారని పేర్కొన్నారు.