అంతర్జాతీయం

ప్రజాబంధం తెంచొద్దు.. రైలు సర్వీసుల జోలికి వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, ఆగస్టు 11: ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎంత ఉద్రిక్తంగా ఉన్నా, ప్రజా సంబంధాలను దెబ్బ తీయవద్దని భారత్, పాక్‌లకు ఇరు దేశాల మధ్య నడిచే థార్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న థార్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. కాగా శనివారం జోద్‌పూర్ నుంచి కరాచీకి 165 మంది ప్రయాణికులు ఉన్న థార్ ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేస్తూ, ఇదే చివరి రైలు సర్వీసు అని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. 2006 సంవత్సరం, ఫిబ్రవరి 18న జోధ్‌పూర్-కరాచీల మధ్య 41 సంవత్సరాల తర్వాత రైలు సర్వీసు పునరుద్ధరణ జరిగింది. ప్రతి శనివారం అర్థరాత్రి అంటే ఒంటి గంటకు జోధ్‌పూర్ నుంచి కరాచీకి రైలు బయలుదేరేది. ఈ థార్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా ఇరు దేశాలకు చెందిన వారు తమ బంధు, మిత్రులను కలుసుకునేందుకు ఉపయోగపడేది. థార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన 165 మంది ప్రయాణికుల్లో 81 మంది భారతీయులు ఉన్నారు. 84 మంది వీసా గడువు ముగియడంతో వెనక్కి వెళ్ళారు. కాగా రైలు సర్వీసులను నిలిపి వేయవద్దని థార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైళ్ళను నిలిపి వేయడం ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య ఉండే సంబంధ భాందావ్యాలు తెగిపోతాయని కరాచీ నుంచి వచ్చిన సైఫుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన బంధువులను కలుసుకునేందుకు తాను జోధ్‌పూర్ వచ్చానని ఆయన చెప్పారు. పాక్‌లోని మీర్పూర్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన దేవ్‌జీ భాయ్ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రైళ్ళను కొనసాగించాలని కోరారు.