అంతర్జాతీయం

శ్రీలంక - ఏపీ మధ్య బౌద్ధ పర్యాటకానికి చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 11: శ్రీలంక - ఆంధ్రప్రదేశ్ మధ్య బౌద్ధ పర్యాటకం విరిసిల్లేలా చేయూతనివ్వాలని రాజ్ భవన్‌లో ఆదివారం తనను కలిసిన శ్రీలంక హైకమిషనర్ ఆస్థిన్ ఫెర్నాండోకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. ఈసందర్భంగా గవర్నర్ రాష్ట్రంలోని విశిష్ట బౌద్ధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు. విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ కార్యక్రమం గురించి కూడా వివరిస్తూ అతిపెద్ద సముద్రతీరం ఉందని, పెట్టుబడులకు అన్నివిధాలుగా అనుకూలమని చెప్పారు. సింగిల్ విండో పథకం ద్వారా ప్రభుత్వం త్వరిగతిన అనుమతులు ఇస్తుందని తెలిపారు. దీనిపై ఆస్థిన్ ఫెర్నాండో స్పందిస్తూ భారతదేశం వ్యాపారం చేసే సార్క్ దేశాల్లో శ్రీలంక అతిపెద్ద దేశమని, అనేక రంగాల్లో శ్రీలంక, భారత దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. గవర్నర్ మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుంచి కూడా తమ కుటుంబ సభ్యులు అనేకమార్లు శ్రీలంక పర్యటనకు వచ్చారని చెప్పారు. ఈసందర్భంగా గవర్నర్‌ను జ్ఞాపికతో సత్కరించారు.