అంతర్జాతీయం

భారత వ్యతిరేక పనులను అనుమతించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నై పై డా, ఆగస్టు 22: తమ భూభాగంపై భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించే ప్రశే్న లేదని మయన్మార్ సోమవారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మయన్మార్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు యు టిన్‌కియాతోపాటు ఆ దేశ కౌనె్సలర్, విదేశాంగ మంత్రి ఆంగ్‌సాన్ సూకితో సమావేశమయ్యారు. రెండు దేశాలు ఫలవంతమైన భాగస్వామ్యం దిశగా ముందుకు వెళ్తున్నాయని టిన్‌కియా అన్నారు. భారత్ తమకు మిత్రదేశమని, ఆ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాద చర్యలకు, చొరబాటు కార్యకలాపాలకు అనుమతించేది లేదని హామీ ఇచ్చారు. రెండు దేశాలు శాంతి, అభివృద్ధి పథంలో కలిసికట్టుగా ముందుకు సాగుతాయని ఇరుదేశాల నేతలు పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు. దాదాపు అయిదు దశాబ్దాల తరువాత ప్రజాస్వామ్య బద్ధంగా మయన్మార్‌లో ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుష్మాస్వరాజ్ తొలి పర్యటన చేస్తున్నారు. మయన్మార్ నుంచి నాగాలాండ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఎన్‌ఎస్‌సిఎన్-కె మిలిటెంట్లను భారత సైనిక బలగాలు ఎన్‌కౌంటర్ చేసిన కొద్దిరోజులకు సుష్మా ఆ దేశంలో పర్యటించటం విశేషం. సంప్రదాయేతర ఇంధన వనరులు, రవాణ, ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు కొనసాగాయని వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారత్ ఇప్పటికే మూడు మెగావాట్ల విద్యుత్తును మొరేశ్-తము లింక్ ద్వారా మయన్మార్‌కు సరఫరా చేస్తోంది. పప్పు్ధన్యాల ఉత్పత్తి, ఇతర వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగాలని నిర్ణయించినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు. ఆంగ్‌సాన్ సూకితో సుష్మా దాదాపు 45నిమిషాలు సమావేశమయ్యారని, న్యాయబద్ధంగా జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన సూకికి సుష్మా అభినందనలు తెలిపారని స్వరూప్ వెల్లడించారు. మయన్మార్ ప్రజల సామాజిక ఆర్థికాభివృద్ధికి భారత్ అన్నివిధాలా తోడ్పడుతుందని సుష్మా హామీ ఇచ్చారన్నారు.