అంతర్జాతీయం

సహజసిద్ధం..మన బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థింఫూ, ఆగస్టు 18: భారత్-భూటాన్ మధ్య ఉన్నంత సాన్నిహిత్యం, పరస్పర అవగాహన ప్రపంచంలోని ఏ రెండు దేశాల మధ్య లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్నది సహజసిద్ధమైన భాగస్వామ్యమని, తద్వారా ఉభయ దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలిపారు. భూటాన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆదివారం ఇక్కడ మాట్లాడిన మోదీ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను ప్రధానంగా ప్రస్తావించారు. భౌగోళికంగానే కాకుండా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఈ దేశాల మధ్య ఉన్న సంబంధం ఎంతో విశిష్టమైనదని అన్నారు. కేవలం ప్రభుత్వాల మధ్యే కాకుండా, ప్రజల మధ్య కూడా విడదీయలేనంత బలమైన బంధం ఉందని మోదీ తెలిపారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారిన ప్రాంతం భారత్ కావడం తమ అదృష్టమని, ఇక్కడ నుంచే ఆయన ఆధ్యాత్మిక సందేశం విశ్వవ్యాప్తమైనదని మోదీ అన్నారు. తరతరాలుగా సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు, మేధావులు ఈ జ్ఞానజ్యోతిని వెలిగిస్తూనే వస్తున్నారని మోదీ పేర్కొన్నారు. వీరి కారణంగానే భారత్-్భటాన్ మధ్య ప్రత్యేకమైన సంబంధాలు బలోపేతమయ్యాయని అన్నారు. అలాగే, రెండు దేశాల మధ్య పెనవేసుకున్న విలువలు అనేక అంతర్జాతీయ అంశాలపై ఒకేరకమైన ఆలోచనలకు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ రకమైన పరస్పర అవగాహన, లోతైన సంబంధాలు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య చూడలేదని, భూటాన్ రాజు లోటే సమక్షంలో మోదీ పేర్కొన్నారు. భూటాన్‌లో పర్యటించిన ఎవరైనా కూడా ఆ దేశ ప్రకృతి సౌందర్యానికి ఎంతగా మంత్రముగ్ధులవుతారో ఆ దేశ ప్రజల ఆత్మీయత, అనురాగం, ఆప్యాయతలకు అంతగానే ప్రభావితులవుతారని మోదీ అన్నారు. ప్రస్తుత భూటాన్ నాయకత్వం ఎంతో పరిణితి సాధించిందని, దీనివల్ల ఈ దేశ ప్రజలు ఎంతగానో పురోగతిని సాధించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక శక్తితో, యువోత్సాహంతోనే నేపాల్ ముందుకు సాగుతూ ఉందని అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు కూడా బలోపేతం కావడానికి ఈ అంశాలే కారణమని ఆయన అన్నారు. ముఖ్యంగా భూటాన్ యువతను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ‘మీరే దేశ భావి నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, కళాకారులు, శాస్తవ్రేత్తలు కూడా’ అని అన్నారు. అద్భుతమైన విజయాలను సాధించగలిగే శక్తి భూటాన్ యువతకు ఉందని, మీరే ఈ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలుగుతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువతకు అన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయని, నేటి యువతకు ఉన్నన్ని అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవని మోదీ తెలిపారు. 130 కోట్ల మంది భారత ప్రజలు భూటాన్ అభివృద్ధి, ఆనందాన్ని కోరుకుంటారని మోదీ తెలిపారు. భారతదేశం కూడా అనేక రంగాల్లో చారిత్రక పరివర్తనను సంతరించుకుంటోందని వెల్లడించిన మోదీ అన్ని రంగాల్లోనూ భూటాన్‌తో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాగా, భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరిగి స్వదేశానికి తిరిగివచ్చారు.

చిత్రం...భూటాన్ రాజధాని థింపూలో ఓ చారిత్రక జాతీయ సంస్మరణ కేంద్రాన్ని సందర్శించిన మోదీ