అంతర్జాతీయం

మళ్లీ ఆయుధ పోటీకి ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఆగస్టు 20: అమెరికా తాజాగా జరిపిన క్షిపణి పరీక్షపై రష్యా, చైనాలు విరుచుకుపడ్డాయి. దీనివల్ల సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అలాగే ఆయుధ పోటీ మరింతగా పెచ్చరిల్లే ప్రమాదమై పొంచివుందని మంగళవారం హెచ్చరించాయి. మాస్కోతో ప్రచ్ఛన్నయుద్ధం నాటి ఆయుధ ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకున్న నేపథ్యంలో రష్యా, చైనాలు ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. ఆయుధ ఒప్పందంపై అమెరికా, రష్యాలు పరస్పరం విమర్శించుకున్నాయి. అమెరికానే ఈ ఒప్పందాన్ని నీరుగరాస్తోందని రష్యా, రష్యానే దీనిని పట్టించుకోవడంలేదని అమెరికా తీవ్రస్థాయిలోనే విమర్శించుకున్న నేపథ్యంలో మధ్యంతర స్థాయి అణు ఆయుధాల ఒప్పందం ఈనెలలో రద్దయిపోయింది. రష్యాతో ఈ ఒప్పందం కారణంగా చైనా వంటి దేశాలను తాము ఎదుర్కోలేకపోతున్నామని అమెరికా స్పష్టం చేసింది. 1987లో రష్యాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా భూతల క్షిపణి పరీక్షలను తాము ఇప్పటివరకు నిలిపివేస్తూ వచ్చామని అమెరికా రక్షణ విభాగం తెలిపింది. అంతేకాకుండా ఆ ఒప్పందం వల్ల అణు సంప్రదాయక మధ్యశ్రేణి ఆయుధాల వినియోగంపై కూడా తమపై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయని తెలిపింది.
అయితే, ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడాన్ని సైనిక ఉద్రిక్తతలను పెంచే చర్యగా రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి షెర్జీ రియోబ్‌కోవ్ తెలిపారు. మళ్లీ ఆయుధ పోటీకి తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని పేర్కొన్న ఆయన ‘ఆర్‌ఐఎన్‌ఎఫ్ నుంచి తప్పుకోవడానికి చాలా వారాల నుంచే క్షిపణి పరీక్షలకు అమెరికా సన్నద్ధమవుతూ వచ్చింది’ అని అన్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెన్ షువాంగ్ కూడా తీవ్ర స్వరంతో స్పందించారు. మళ్లీ ఆయుధ పోటీకి ఆద్యం పోసే విధంగా అమెరికా వ్యవహరిస్తోందని, దీనివల్ల సైనిక సంఘర్షణలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ప్రచ్ఛన్నయుద్ధం నాటి ఆలోచనా ధోరణిని అమెరికా విడనాడడం ఎంతైనా మంచిదని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ, ప్రాంతీయ శాంతికి దోహదం చేసే రీతిలో అమెరికా వ్యవహరించడం ఎంతైనా అవసరమని అన్నారు. తాజాగా, క్షిపణి ప్రయోగాన్ని కాలిఫోర్నియా సమీపంలోని శాన్ నికోలాస్ దీవి నుంచి అమెరికా ప్రయోగించింది. అమెరికా క్షిపణి ప్రయోగానికి ముందే ఫ్రాన్స్‌లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అమెరికా ఈ రకమైన ఆయుధాలను సన్నద్ధం చేసుకుంటే అందుకు మేము కూడా వెనుకాడేది లేదు’ అని తేల్చిచెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుల్ మాక్రాన్‌తో ఆయన మీడియాతో మాట్లాడారు. 1987 ఐఎన్‌ఎఫ్ ఒప్పందానికి తాము కట్టుబడి వస్తున్నామని, కానీ అమెరికానే ఏకపక్షంగా దీనినుంచి తప్పుకుందని పుతిన్ అన్నారు.