అంతర్జాతీయం

పూర్తిగా వైదొలగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 21: అఫ్గనిస్తాన్ నుంచి తమ దళాలు పూర్తిగా వైదొలగే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇక్కడి తాలిబన్లు మళ్లీ పుంజుకుని తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎలాంటి అవకాశం లేకుండా కట్టడి చేస్తామని, ఇందుకోసమే తమ దళాలను కొంతమేర ఇక్కడే ఉంచుతామని ఆయన తెలిపారు. 2001 నుంచి అఫ్గాన్‌లో తాలిబన్లతో జరుపుతున్న యుద్ధంలో 2400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది. 2016 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ట్రంప్ అఫ్గాన్ నుంచి పూర్తిస్థాయిలో తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అయితే, ఇపుడు మారిన పరిస్థితుల దృష్ట్యా పూర్తిగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తాలిబన్లతో జరుపుతున్న శాంతి చర్చల గురించి ప్రస్తావించిన ఆయన అఫ్గాన్‌లో పూర్తిస్థాయిలో శాంతిని పాదుగొలిపేందుకు అనేక అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఆవిధంగానే తాము ముందుకు వెళ్తున్నామని, తమ ఆలోచలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం తాలిబన్లతో జరుపుతున్న చర్చలు అనుకున్న విధంగానే సాగుతున్నాయని, అంతిమ ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అఫ్గాన్‌లో శాంతి విషయంలో ఇప్పటివరకు వచ్చిన అమెరికా అధ్యక్షులు అందరికంటే కూడా తాను ఎక్కువే చేస్తున్నానని ట్రంప్ వివరించారు. తాను ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేసిన ట్రంప్ అఫ్గానిస్తాన్ కారణంగానే సోవియట్ యూనియన్ కాస్త రష్యాగా చీలిపోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం అఫ్గాన్ వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకునే పరిస్థితి లేదని పేర్కొన్న ఆయన ‘ఇందుకు రష్యా సిద్ధమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని తెలిపారు.