అంతర్జాతీయం

ఐరాస దృష్టికి కాశ్మీర్ అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 23: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వచ్చే నెలలో జరిగే ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాలలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతారని ఒక మీడియా కథనం వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ ఐరాస జనరల్ అసెంబ్లీలో సెప్టెంబర్ 27న ప్రసంగించనున్నారని ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ తెలిపింది. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో భారత్‌కు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కమ్యూనిటి సభ్యులను, మానవ హక్కుల సంస్థలను సమీకరించాలని ఇమ్రాన్ ఖాన్ తన పార్టీని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడం అనేది తన అంతర్గత విషయమని భారత్ ఇప్పటికే అంతర్జాతీయ సమాజానికి స్పష్టంగా చెప్పింది. వాస్తవ పరిస్థితిని అంగీకరించాలని పాకిస్తాన్‌కు హితవు పలికింది. ఇమ్రాన్ ఖాన్ నాలుగు రోజుల అమెరికా పర్యటన సెప్టెంబర్ 23న మొదలవుతుంది.