అంతర్జాతీయం

మాంచెస్టర్‌లో గాంధీ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 24: యూకేలోని మాంచెస్టర్ నగరంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. శాంతి చిహ్నంగా మహాత్ముడి విగ్రహం నెలకొల్పారు. తొమ్మిది అడుగుల ఎత్తయిన కాంశ్య విగ్రహాన్ని భారత శిల్పకారుడు రామ్ వీ సుతార్ రూపొందించారు. నగర నడిబొడ్డున ఉన్న మాంచెస్టర్ కేథడ్రల్ బయట దీన్ని ఏర్పాటు చేశారు. మహాత్ముడి 150 జయంతి సందర్భంగా విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్ ధర్మపూర్(ఎస్‌ఆర్‌ఎండీ) చొరవతో విగ్రహం ఏర్పాటైంది. ఎస్‌ఆర్‌ఎండీ ప్రధాన కేంద్రం భారత్‌లో ఉంది. 2017లో మాంచెస్టర్‌లోని ఎరీనాగ్రాండ్ వద్ద ఆత్మాహుతి బాంబు మారణహోం సృష్టించింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్‌ఐఎస్) ఉగ్రదాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా, అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్‌ఆర్‌ఎండీ సంకల్పించింది. ‘ఐఎస్ మానవబాంబు విధ్వంసం సృష్టించినా మాంచెస్టర్ ప్రజలు చూపిన మనోధైర్యం, ఐక్యత ఎంతో గొప్పది. దాన్ని స్పూర్తిగా తీసుకుని అహింసా సిద్ధాంతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేం ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకున్నాం’ అని లండన్‌లోని ఎస్‌ఆర్‌ఎండీ ప్రతినిధి మంథన్ తస్‌వాలా వెల్లడించారు. ప్రపంచ శాంతికి గాంధీజీ బోధనలే శరణ్యమని అన్నారు. మాంచెస్టర్ కేథడ్రల్, మాంచెస్టర్ సిటీ కౌన్సిల్, భారత హైకమిషన్ తోడ్పాటును అందించాయని చెప్పారు. విగ్రహానికి అయ్యే ఖర్చును భారత సంతతికి చెందిన కమానీ కుటుంబం భరించింది. గాంధీ విగ్రహం నెలకొల్పాలన్న తమ ప్రతిపాదనకు మాంచెస్టర్ సిటీ కౌన్సిల్ సత్వర ఆమోదం తెలపడంపై తస్‌వాలా సంతోషం వ్యక్తం చేశారు. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 25న ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.