అంతర్జాతీయం

ఢాకా రెస్టారెంట్‌పై దాడి సూత్రధారి హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఆగస్టు 27: గత నెలలో ఢాకాలోని ఒక రెస్టారెంట్‌పై దాడి చేసి ఒక భారతీయ యువతిసహా 22 మందిని హతమార్చిన ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన తమీమ్ అహ్మద్ చౌదరిని బంగ్లాదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. ఢాకా సమీపంలోని తమీమ్ రహస్య స్థావరంపై శనివారం దాడి చేసిన పోలీసులు అతనితోపాటు అతని సహాయకులు ఇద్దరిని కా ల్చిచంపారు. ఢాకా శివార్లలోని ఒక భవనంలో పోలీసులు సోదాలు చేస్తుండగా ఇస్లామిక్ ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని కౌంటర్ టెర్రరిజం యూనిట్ అదనపు డిప్యూటి కమిషనర్ సానోవర్ హొస్సేన్ చెప్పినట్లు ‘బిడిన్యూస్24.కామ్’ తెలిపింది.
అరెస్టయిన నిషిద్ధ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక మిలిటెంట్ ఇంటరాగేషన్ సందర్భంగా ఇచ్చిన సమాచారం మేరకు తమీమ్ రహస్య స్థావరంపై దాడి చేసినట్లు యూనిట్ చీఫ్ మొనిరుల్ ఇస్లాం అంతకుముందు తెలిపారు. పోలీసులు జరిపిన దాడి సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ముగ్గురిలో బంగ్లాదేశ్‌లో పుట్టిన కెనడా పౌరుడు తమీమ్ చౌదరి ఉన్నట్లు పోలీసు అధికార ప్రతినిధి జలాలుద్దీన్ ధ్రువీకరించారు. ఉగ్రవాదుల అణచివేతలో బంగ్లాదేశ్ పోలీసులు ఇటీవల సాధించిన రెండో పెద్ద విజయమిది. పోలీసులు గత నెలలో తొమ్మిది మంది అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను హతమార్చారు. కొంతమంది ఉగ్రవాదులు ఆ భవనంలో తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు కౌంటర్ టెర్రరిజం, ట్రాన్స్‌నేషనల్ క్రైమ్ యూనిట్, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, జిల్లా పోలీసులకు చెందిన సిబ్బంది సంయుక్తంగా శనివారం ఉదయమే ఆ భవనాన్ని చుట్టుముట్టినట్లు నారాయణ్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ మైనుల్ హక్ తెలిపినట్లు ‘ద డెయిలీ స్టార్’ పేర్కొంది. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా అందులో ఉన్న నేరస్థులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని ఆయన వివరించారు. ‘ఆపరేషన్ హిట్ స్ట్రాంగ్ 27’ కోడ్‌నేమ్‌తో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసు ఐజి తెలిపారు. సుమారు గంటసేపు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. తరువాత గదిలోకి వెళ్లిచూడగా మూడు మృతదేహాలు నేలపై పడి ఉన్నాయన్నారు. అందులోని ఒకరి ముఖం చౌదరి ఫొటోతో పూర్తిగా సరిపోయిందని పేర్కొన్నారు. సంఘటన స్థలం నుంచి గ్రెనేడ్లను, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదులు తమను తాము ఔషధ వ్యాపారులుగా పరిచయం చేసుకొని, ఆ భవనంలో అద్దెకు ఉన్నారని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్‌కు ఇంటి యజమాని సహకరించారని తెలిపారు.

చిత్రం.. ఢాకా ఎన్‌కౌంటర్‌లో చనిపోయన తమీమ్ అహ్మద్‌తో పాటు
మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను మార్చురీకి తరలిస్తున్న దృశ్యం