అంతర్జాతీయం

ఇద్దరు ప్రాణ మిత్రులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో, ఆగస్టు 27: ఇద్దరు ప్రాణ మిత్రులు.. నాలుగు దశాబ్దాల క్రితం కేవలం మూడు రోజుల వ్యవధిలో జన్మించారు. కానీ పుట్టిన వెంటనే వారి తల్లులు మారిపోయారు. ఈ విషయం 41 సంవత్సరాల తర్వాత వెలుగులోకి రావడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది కథ కాదు. ఈ వాస్తవిక ఘటన కెనడాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. డేవిడ్ టియట్, లియోన్ స్వాన్‌సన్ 1975లో కెనడా పశ్చిమ ప్రాంత రాష్టమ్రైన మానిటోబాలోని నార్వే హౌస్ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. అయితే ఆ ఆసుపత్రి సిబ్బంది పొరపాటున టియట్‌ను స్వాన్‌సన్ తల్లికి, స్వాన్‌సన్‌ను టియట్ తల్లికి అప్పగించారు. దీంతో వీరిద్దరూ ఇంతకాలం ఒకరి కుటుంబంలో మరొకరు పెరిగి పెద్దవారయ్యారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం వలన వీరి తల్లులు మారిపోయారని తాజాగా నిర్వహించిన డిఎన్‌ఎ పరీక్షల్లో తేలింది. దీంతో ఏమిచేయాలో తెలియక టియట్, స్వాన్‌సన్ భోరున ఏడ్చేశారు. ఈ గందరగోళానికి కారకులైన నార్వే హౌస్ ఆసుపత్రి సిబ్బంది పట్ల తీవ్రమైన ఆగ్రహం కలుగుతోందని వారు విలేఖరుల సమావేశంలో వాపోయారు.