అంతర్జాతీయం

ప్రాణం నిలబెట్టేందుకు.. 15గంటలు గుండె ఆపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 29:గుండె కొట్టుకోవడం నిమిషం ఆగిపోతే..ప్రాణానికే ముప్పని బెంబేలెత్తిపోతాం. అలాంటిది..ఓ తొమ్మిది నెలల చిన్నారి గుండెను ఏకంగా పదిహేను నిముషాల పాటు వైద్యులు ఆపేశారు! అదీ ఆ చిన్నారి ప్రాణాల్ని కాపాడేందుకే...యుకెకు చెందిన నాథన్ బైర్నీ అనేక బాబుకు జన్మతః గుండెలో చిల్లు ఉంది. ఏ క్షణలోమైనా అతడి ప్రాణానికి ముప్పేనన్న భయం తల్లి దండ్రులను వెంటాడుతూనే వచ్చింది. ఆర్నెల్లకు మించి జీవించక పోవచ్చుననీ మొదట్లో చెప్పేశారు. ఈ చిన్నారి గుండె లోపాన్ని సరిదిద్దడాన్ని వైద్యులు ఓ సవాలుగా తీసుకున్నారు. మూడున్నర నెలలప్పుడు ఆపరేషన్ జరిగింది. ఇందులో భాగంగా సుదీర్ఘ శస్త్ర చికిత్స చేయడానికి ఆ పాప గుండెను మొత్తం పదిహేను గంటల పాటు ఆపేశారు. మొదట్లో ఏడు గంటల్లోనే ఆపరేషన్ అయిపోతుందని చెప్పిన వైద్యులు..ఆ క్రమంలో అనేక సమస్యలు తలెత్తడంతో పదిహేను గంటలు తీసుకున్నారు. మొత్తం మీద వైద్యుల కృషి ఫలించి ఆపరేషన్ దిగ్విజయమైంది. ఇప్పుడు తొమ్మిది నెలల నాథన్ చిరునవ్వులు తల్లిదండ్రులు లెస్లీ, డేవిడ్‌లకు ఎనలేని ఆనందానే్న ఇస్తున్నాయి. పదకొండు రోజుల తర్వాత అదీ మాతృత్వ దినోత్సవం రోజునే తన బిడ్డ తన చేతికొచ్చాడంటూ ఆ తల్లి ఉప్పొంగిపోయింది.