అంతర్జాతీయం

‘హౌడీ, మోదీ’లో ముస్లింల కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, సెప్టెంబర్ 13: అమెరికాలోని హూస్టన్‌లో ఈ నెల జరుగనున్న ‘హౌడీ, మోదీ’ కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక పేరుపొందిన ఇండియన్-అమెరికన్ ముస్లిం సంస్థ క్రియాశీలక మద్దతు అందిస్తోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ (ఐఎంఏజీహెచ్) ప్రధాన వెల్‌కమ్ పార్టనర్‌లలో ఒకటిగా ఉంది. ‘మనం ఇతరులందరి విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు. కాని, వారితో సుహృద్భావ, స్నేహపూర్వక వాతావరణంలో ఇష్టాగోష్టిగా కలవకపోతే, వారి గురించి మనం ఒక దృక్పథాన్ని ఏర్పరచుకోజాలం’ అని ఐఎంఏజీహెచ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ మఖ్బూల్ హక్ అన్నారు. ‘వారణాసి (మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం)లో పెరుగుతున్నప్పుడు నేను ఎప్పుడూ నాకు ఇతరులతో సమానమయిన అవకాశాలు ఉన్నాయని భావించేవాడిని. భారతీయుడిని, ముస్లింను అయినందుకు నేను గర్వపడుతుంటాను. అందువల్ల నా మాతృదేశం భారత్ నుంచి ఎన్నికయిన నాయకుడు నేను స్థిరపడిన పట్టణాన్ని సందర్శిస్తుంటే అతడికి హృదయపూర్వక స్వాగతం పలకడం నా విద్యుక్త ధర్మం’ అని ఐఎంఏజీహెచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు లతాఫత్ హుస్సేన్ అన్నారు.