అంతర్జాతీయం

ఘర్షణలతో అట్టుడికిన హాంకాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, సెప్టెంబర్ 15: హాంకాంగ్ వీధులు మళ్లీ నిరసనలు, ఘర్షణలతో అట్టుడికాయి. ఆదివారం వేలాదిగా వీధుల్లోకి వచ్చిన ప్రజలు చైనా వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు. వీటికి ఎలాంటి అనుమతి లేకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులు కూడా రాళ్లు, పెట్రోల్ బాంబులతో ఎదురుదాడికి దిగారు. గత 99 రోజులుగా హాంకాంగ్‌లో ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆదివారం ఒక్కసారిగా ఈ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు ప్రభుత్వ భవనంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులకు, వారికి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అలాగే చైనాకు సంబంధించిన ఒక బ్యానర్, జెండాను ఆందోళనకారులు తగలబెట్టారు. దారిపొడవునా కన్పించినదాన్ని కనిపించినట్టే దగ్ధం చేశారు. సబ్‌వే స్టేషన్లను ధ్వంసం చేశారు. ఎప్పుడైతే పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారో ఎవరికి వారుగా చెల్లాచెదరైపోయారు.