అంతర్జాతీయం

మోదీపై నోరు జారొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 16: కాశ్మీర్ సమస్య విషయంలో తలెత్తిన వివాదాన్ని మరింత తీవ్రం చేయకుండా దౌత్య ప్రయత్నాలతో దీనిని పరిష్కరించుకోవాలని కొన్ని ముస్లిం దేశాలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గట్టిగా విజ్ఞప్తి చేశాయి. అలాగే, భారత ప్రధాని మోదీపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ధోరణిని కూడా కట్టిపెట్టాలని ఇమ్రాన్‌కు విజ్ఞప్తి చేశాయి.
ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన సౌదీ ఉప విదేశాంగ మంత్రి అదల్ అల్ జుబేహిర్, యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దులా బిన్ అల్ మహ్యాన్ పలు ముస్లిం దేశాల నుంచి సందేశాన్ని పాక్ ప్రధానికి అందించినట్టుగా సోమవారం వార్తా కథనాలు వెలువడ్డాయి. తమ తమ దేశాధి నేతల నుంచే కాకుండా పలు శక్తివంతమైన ముస్లిం దేశాల నుంచి కూడా కాశ్మీర్‌పై పాక్‌కు ఈ సందేశాన్ని అందించారని తెలుస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్‌పై తలెత్తిన ఉద్రిక్తతలను సడలించాలంటే దొడ్డిదారి దౌత్య యత్నాలను పాక్ చేపట్టాలని వీరు కోరినట్టుగా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే పత్రిక వెల్లడించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ, ఆర్మీ చీఫ్ వాజ్వాలతో కూడిన వీరు సమావేశమయ్యారు. ఈ సమావేశాలు అత్యంత గోప్యంగా జరిగాయని, అత్యున్నత స్థాయి గల అధికారులను మాత్రమే అనుమతించారని ఈ పత్రిక వెల్లడించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను సడలించేందుకు జోక్యం చేసుకునేందుకు కూడా ఈ దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పరిస్థితి మరింత శృతిమించకుండా ఉండాలంటే భారత్ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని ఇమ్రాన్ కట్టి పెట్టాలని కూడా వీరు స్పష్టం చేశారు. అయితే, ఈ అభ్యర్థలను పాకిస్తాన్ తిరస్కరించిందని, భారత్‌తో నేరుగానే చర్చలు జరుపుతామే తప్ప, దొడ్డిదారి జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్టు ఈ పత్రిక వెల్లడించింది.