అంతర్జాతీయం

ఐరాస వేదికగా.. పాక్‌ను ఎండగడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 20: ఐక్యరాజ్య సమితి (యూఎన్) సాధారణ సభలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావిస్తూ, అదే సమావేశంలో ఎండగడతామని భారత దౌత్యాధికారి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. యూఎన్‌కు భారత్ శాశ్వత ప్రతినిధిగా సేవలు అందిస్తున్న ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్తాన్ చేసే ఎలాంటి ప్రయత్నాన్నయినా సమర్థంగా తిప్పికొడతామని అన్నారు. కాశ్మీర్ అంశం పూర్తిగా భారత్ ఆంతరంగిక వ్యవహారమని, ఇందులో ఎవరి జోక్యాన్ని సహించబోమని తేల్చిచెప్పారు. ఈనెల 27న జరిగే యూఎన్ సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ)లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయడం పూర్తిగా భారత్‌కు సంబంధించిన విషయమని ఆయన అన్నారు.
ఉగ్రవాద అంశమే ప్రధానం!
సాధారణ సభ సమావేశానికి హాజరైనప్పుడు, ఉగ్రవాద సమస్యనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. పీటీఐకి అందిన సమాచారం మేరకు, అంతేగాక, కాశ్మీర్ అంశాన్ని ఆయన ప్రస్తావించి, ఈ విషయంలో పాక్ వైఖరిని ఎండగట్టేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యారు. తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థలను ఉక్కుపాదంతో అణచివేయాలని, తిరుగులేని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాలు స్పష్టం చేసేలా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా పేర్కొన్నారు. సాధారణ సభ సమావేశంలో కాశ్మీర్ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చేందుకు పాక్ ప్రయత్నించడం ఖాయమని, దానిని తిప్పికొడతామని ఆయన అన్నారు. పాక్ ఈ అంశాన్ని ఏ విధంగా ప్రస్తావించినప్పటికీ, భారత్ సమాధానం మాత్రం ఘాటుగా, వాటిని ఎండగట్టేవిగా ఉంటాయని పేర్కొన్నారు. పాక్‌లో ఉగ్రవాదం వేళ్లూనుకొని ఉందనే విషయం ఎన్నో సందర్భాల్లో స్పష్టమైందని అక్బరుద్దీన్ గుర్తుచేశారు. ‘జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేయడం, రెండు లఢాక్ ప్రాంతాన్ని వేరుచేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం తదితర అంశాలను ఎవరు ప్రస్తావించినా, మా సమాధానం మాత్రం తీవ్రంగానే ఉంటుంది. పాక్ ఈ ప్రయత్నం చేస్తుందనేది నిజం. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఇప్పటికే దీనిని ధ్రువీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సమాధానం వంట రెట్లు తీవ్రంగా ఉంటుంది. పాక్ ఆటలను సాగినివ్వం’ అని స్పష్టం చేశారు.