అంతర్జాతీయం

ఇక చిగురాశే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 20: చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్‌తో సంకేతాలను పునరుద్ధరించుకోవాలన్న ఇస్రో ప్రయత్నం దాదాపుగా ముగిసినట్లుగానే కనిపిస్తోంది. శనివారంతో చంద్రుడిలో 14రోజుల పగలు ముగిసి రాత్రి ప్రవేశించనుంది. దీని దృష్ట్యా లాండర్ పని చేయడానికి అవసరమైన సూర్యరశ్మి కొరవడుతుంది. ఈ పధ్నాలుగు రోజుల వ్యవధిలో లాండర్‌తో
సాంకేతిక సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా విస్తృతంగానే ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలేవీ ఆశించిన ఫలితాలు అందించలేదు. మరో 2.1 కిమీ దిగితే చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టే సమయంలో ఈ ల్యాండర్‌తో ఇస్రో సంబంధాలు ఈ నెల 7న తెగిపోయాయి. చంద్రుడి ఉపరితలాన్ని ఈ ల్యాండర్ బలంగా ఢీకొనడం వల్లే సంకేతాలు తెగిపోయినట్టుగా చెబుతున్నారు. చంద్రుడిపై పగటి కాలం ముగిసేలోగానే లాండర్‌తో ఇస్రో సాంకేతిక సంబంధాలను పునరుద్ధరించుకుని ఉంటే చంద్రయాన్-2 ఆశలు సజీవంగానే ఉండేవి. అయితే ఇందుకు దాదాపుగా అవకాశాలు మృగ్యమేనన్న వాదన వినిపిస్తోంది. సొంతంగానే ఇంధన శక్తిని పొంది లాండర్ పని చేయాలంటే సూర్యరశ్మి అవసరం. శనివారం నుంచి చంద్రుడిపై 14రోజల రాత్రి మొదలు అవుతుంది. అప్పుడు ఏర్పడే అతిశీతల వాతావరణంలో విక్రమ్ లాండర్ పని చేసే అవకాశం ఉండదు.అయితే చంద్రుడి రాత్రి ప్రారంభమవుతోందనడానికి సంబంధించి ఇస్రో నుంచి అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేదు. కాగా, ఇప్పటి వరకు చంద్రయాన్-2 ద్వారా ఆశించిన లక్ష్యాల్లో 90 నుంచి 95 శాతం నెరవేరాయని, విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినప్పటికీ చంద్రునికి సంబంధించిన పరిశోధనలు మాత్రం కొనసాగే అవకాశం ఉంటుందని ఇస్రో వివరించింది. ఆర్బిటర్ కాలపరిమితి ముందు అనుకున్నట్లుగా ఏడాది కాకుండా ఏడేళ్ళు కొనసాగుతుందని, దీని ద్వారా అనేక రకాలుగా చందమామను అధ్యయనం చేయవచ్చని వెల్లడించింది. ఈ అర్బిటర్‌లో చంద్రున్ని అధ్యయనం చేసేందుకు మొత్తం 8 పరికరాలు ఉన్నాయి.