అంతర్జాతీయం

నవ కాశ్మీర్ అందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్ : త్వరలోనే భారత్‌లో నవ కాశ్మీరం ఆవిష్కృతం కాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 17 మంది కాశ్మీరీ పండిట్ల బృందం తనను కలుసుకున్న సందర్భంగా వారితో మాట్లాడిన మోదీ కొత్త కాశ్మీర్ ప్రతిఒక్కరిదీ అని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో కొత్త పవనాలు వీస్తున్నాయని, కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్ది అభివృద్ధిపథంలో నడిపిస్తామని ఈ బృందానికి మోదీ స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఎంతో సహనంతో వ్యవహరించిన కాశ్మీరీ పండిట్లకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ వీరందరితో జరిపిన చర్చలు ఆహ్లాదకరంగా సాగాయని మోదీ ట్వీట్ చేశారు. ప్రవాస కాశ్మీరీ పండిట్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచారని, అలాగే భారత్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
మోదీని కలిసిన సిక్కుల బృందం
హోస్టన్ వచ్చిన భారత ప్రధాని మోదీని 50 మంది సభ్యులు గల సిక్కుల బృందం కూడా కలుసుకుంది. దాదాపు 300 మంది తమ సభ్యులను బ్లాక్ లిస్టు నుంచి తొలగించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మోదీకి ఒక తలపాగాను బహూకరించింది. సిక్కులకు వీసా, పాస్‌పోర్ట్ సేవలను అందించాలని కోరింది. గురునానక్ 550వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాము భారత్ రావాలంటే తమకు వీసా, పాస్‌పోర్టు సదుపాయాలు కల్పించడం ఎంతో అవసరమని ఈ బృందం స్పష్టం చేసింది. అమెరికాలోని సిక్కులంతా భారత్ అభివృద్ధి పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.
*చిత్రాలు.. హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హోస్టన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ కాశ్మీరీ పండిట్ల బృందంతో మాట్లాడుతున్న దృశ్యం.
*ప్రధానికి స్వాగతం పలుకుతున్న అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్