అంతర్జాతీయం

కొత్త చరిత్ర..సరికొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, సెప్టెంబర్ 22: హోస్టన్ వేదిక సాక్షిగా భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 50 వేల మందికి పైగా హాజరైన హౌడీ-మోదీ చారిత్రక సదస్సునుద్ధేశించి మాట్లాడిన మోదీ ఇరు దేశాల మైత్రి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడంతో పాటు అన్ని రంగాల్లోనూ బలమైన బంధాన్ని పాదుకొలిపిందన్నారు. తెలుగు, హిందీతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ స్వాగతం పలికిన మోదీ ప్రతి ఒక్కరినీ అలరించారు. సంకల్పంతోనే సిద్ధి అన్న బలమైన నినాదంతోనే భారతావని జాజ్వల్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ట్రంప్‌కు ఆహ్వానం పలుకుతూ తొలుత ఆంగ్లంలో మాట్లాడిన అనంతరత వేదికపైకి వచ్చి హిందీలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత దేశంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. మొదటి ఐదేళ్ళు అధికారంలో ఉన్న తాము అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని, అనంతరం కూడా రెండో సారి తిరుగులేని మెజారిటీతో చేపట్టి అనేక సంచలన నిర్ణయాలను అమలు చేశామన్నారు. జన్-్ధన్‌తో సహా తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను భారత్ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. భిన్న మతాలు, భాషలు కలిగిన భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి తిరుగు లేని ప్రతీక అని మోదీ స్పష్టం చేశారు. నవ భారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు రాత్రింభవళ్ళు కృషి చేస్తున్నారని అనేక రకాలుగా పరివర్తనను పాదుకొల్పుతున్నాడని మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సరళీకరణ దిశగా తాము తీసుకున్న నిర్ణయాలు అనేక రకాలుగా దేశానికి పుష్టిని అందించాయని, అలాగే ఆన్‌లైన్ సేవలు కూడా అనూహ్య రీతిలో విస్తృతమయ్యాయని మోదీ తెలిపారు. సులభతర వ్యాపార, వాణిజ్యం దిశగా తాము తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక రకాలుగా సౌలభ్యం పెరిగిందని కంపెనీల రిజిస్ట్రేషన్లు కూడా అతితక్కువ వ్యవధిలోనే జరుగుతున్నాయని మోదీ వెల్లడించారు. ఇటీవల భారత్‌లో జరిగిన
ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య విశిష్టతను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. అమెరికా జనాభాకు రెండింతల సంఖ్యలో అంటే 61 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని మోదీ తెలిపారు. అత్యంత చౌకగా భారత దేశంలో డేటా అందుబాటులోకి వస్తున్నదని, అన్ని రంగాల్లోనూ అమలులోకి వచ్చిన ఆన్‌లైన్ సేవలతో పరిపాలన కూడా అనూహ్య వేగాన్ని పుంజుకున్నదని మోదీ తెలిపారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి బహిరంగ మల విసర్జనకు భారత్ పూర్తి స్థాయిలో స్వస్తి పలుకుతుందని హర్షధ్వనుల మధ్య ప్రకటించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 రాజ్యాంగ అధికరణ రద్దు ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు నవశకాన్ని అందించామని మోదీ తెలిపారు. ఈ అధికరణ వల్లే జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం వెర్రితలలు వేశాయన్నారు. ప్రజలు అఖండ రీతిలో ఇచ్చిన తీర్పుతోనే వారి ఆశలు, ఆకాంక్షలకు అద్దం పడుతూ ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. వ్యక్తిగతంగా మోదీ ఓ వ్యక్తి మాత్రమేనని, అఖండమైన భారతీయుల మద్దతుతోనే తిరుగులేని రీతిలో ముందుకు సాగుగలుగుతున్నామని మోదీ అన్నారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణబద్ధంగా పని చేస్తున్నదని మోదీ తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం నెలకొన్నా భారత్ వృద్ధి రేటు బలంగా, స్థిరంగా సాగిందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

*చిత్రం... హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో సభికులకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ