అంతర్జాతీయం

అద్వితీయ బంధం మనది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, సెప్టెంబర్ 22: గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. హోస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ మెగా కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ ఉభయ దేశాలూ ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో పని చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో 50 వేలకు పైగా ఇండో-అమెరికన్లు పాల్గొన్న ఈ సదస్సులో మాట్లాడిన ట్రంప్ భారత్‌లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన, అభివృద్ధి పథంలో పరుగెడుతున్న భారతావని ఆవిష్కృతమవుతోందన్నారు. మోదీ సారథ్యంలో భారత్ మరింత శక్తిని పుంజుకున్న విషయాన్ని యావత్ ప్రపంచం గమనిస్తున్నదని ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు గతంలో ఎన్నడూ
లేని రీతిలో సిరి సంపదలతో తులతూగే రీతిలో ప్రధాని మోదీతో కలిసి పని చేయాలని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. అమెరికా అభివృద్ధిలో ఇండో-అమెరికన్ల కృషి ఎంతో ఉందని నిరంతరం కష్టపడి పని చేసే మనస్వత్వం అని ట్రంప్ ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన బంధాన్ని కూడా పెంపొదించుకునేందుకు త్వరలోనే పలు రక్షణ ఒప్పందాలు కుదరబోతున్నాయని ట్రంప్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తిన మోదీ ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. మోదీ తనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడని ట్రంప్ అభివర్ణించారు. మొదట మాట్లాడిన ట్రంప్ ప్రసంగాన్ని మోదీ ఆద్యంతరం ఆసక్తిగా తిలకించారు. ట్రంప్ తన ప్రసంగంలో ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలతో పాటు ప్రజాపరంగా పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని కూడా ప్రశంసించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి భారతీయ అమెరికన్లకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలకు సరిహద్దు భద్రత అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ‘నేను నా భారతీయ కుటుంబానికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను’ అని ట్రంప్‌ను ఇండో-అమెరికన్లకు పరిచయం చేశారు. ట్రంప్ అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి అని అమెరికాను అన్ని రంగాల్లో ప్రభావితం చేశారని అన్నారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందే ట్రంప్ గురించి ప్రపంచమంతా తెలుసునని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాలపై ఎప్పుడు చర్చ జరిగినా ఆయన పేరు అనివార్యంగా ప్రస్తావనకు వస్తుందన్నారు. తాను ట్రంప్‌ను ఎప్పుడు కలుసుకున్నా ఎంతో ఉత్సాహభరితంగా, ఆహ్లాదభరితంగా, స్నేహపూర్వకంగానే సంభాషణలు జరిగాయని మోదీ తెలిపారు. అనంతరం వేదిక దిగిన మోదీ ట్రంప్ ప్రసంగాన్ని సభికుల్లో కూర్చొని ఆలంకించారు.
*చిత్రం...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు శ్రద్ధగా వింటున్న మోదీ