అంతర్జాతీయం

‘కాశ్మీర్’పై యథాతథ స్థితికే అమెరికా మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 1: జమ్మూకాశ్మీర్, నియంత్రణ రేఖ విషయంలో యథాతథ స్థితి కొనసాగడానికే అమెరికా సానుకూలంగా ఉన్నట్లు కనపడుతోంది. అయితే శాంతి, కాశ్మీర్‌పై చర్చల పరిధి, సరళి వంటి నిర్ణయాలు భారత్, పాకిస్తాన్‌లు తీసుకోవలసినవేనని అమెరికా స్పష్టం చేసింది. ‘ఆజాద్ కాశ్మీర్’, గిల్గిట్ బాల్తిస్తాన్‌లు పాకిస్తాన్ పాలనలో ఉన్న భూభాగాలుగా మేము గుర్తించాం. జమ్మూకాశ్మీర్‌ను వేరు చేస్తూ 1972లో నిర్ణయించిన నియంత్రణ రేఖను గుర్తించాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. పిఒకెను ఖాళీ చేయాల్సిందిగా భారత్ ఇటీవల పాకిస్తాన్‌ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె), గిల్గిట్ బాల్తిస్తాన్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఈ విషయం చెప్పారు. కాశ్మీర్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.