అంతర్జాతీయం

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 1: ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారని 60 ఏళ్ల నాటి జపాన్ ప్రభుత్వ రహస్య పత్రాలు వెల్లడించాయి. నేతాజీ మృతిపై ఆనాటి జపాన్ ప్రభుత్వ అధికారిక రహస్య పత్రాలు గురువారం వెలుగుచూశాయి. ఇంతకాలం అటు జపాన్ ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం రహస్య పత్రాలుగా ఉంచిన ‘దివంగత సుభాశ్ చంద్రబోస్ మృతికి దారితీసిన పరిస్థితులు, ఇతర అంశాలపై దర్యాప్తు’ అనే శీర్షికతో కూడిన నివేదిక గురువారం వెలుగుచూసిందని బ్రిటన్‌కు చెందిన బోస్‌ఫైల్స్.ఇన్ఫో అనే వెబ్‌సైట్ తెలిపింది. నేతాజీ మృతికి దారితీసిన పరిస్థితులను వెల్లడించే అధికారిక పత్రాలతో కూడిన ఆధారం మొదటిసారిగా లభ్యమయిందని వెబ్‌సైట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 1956 జనవరిలో పూర్తయిన ఈ నివేదికను జపాన్ ప్రభుత్వం టోక్యోలో ఉన్న ఇండియన్ ఎంబసీకి సమర్పించిందని వెబ్‌సైట్ వివరించింది. అప్పటి నుంచి ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ నివేదికను ర హస్య పత్రంగానే ఉంచాయి. జపనీస్ భాషలో ఏడు పేజీలలో ఉన్న ఈ పత్రం ఇంగ్లీషులోకి అనువదించగా 10 పేజీలు అయింది. 1945 ఆగస్టు 18న విమానం కూలిపోయిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేతాజీ అదే రోజు సా యంత్రం తైపేయి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఈ నివేదిక వెల్లడించింది. బోస్ తదితరులు ఎక్కిన ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని, బోస్ తీవ్రంగా గాయపడ్డారని ఇనె్వస్టిగేషన్‌లో తేలినట్లు నివేదిక తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు తైపేయిలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన బోస్ సాయంత్రం 7 గంటలకు మృతి చెందినట్లు వెల్లడించింది. తైపేయిలోని మున్సిపల్ శ్మశానవాటికలో ఆగస్టు 22న ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది.
విమానం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులను కూడా నివేదిక వెల్లడించింది. విమానం టేకాఫ్ అయి భూమికి 20 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత విమానానికి ఎడమవైపున గల ఛోదక పంకాకు గల ఒక రెక్క అకస్మాత్తుగా విరిగిపోయింది. దీంతో ఇంజిన్ పడిపోయింది. ఫలితంగా విమానం అదుపు తప్పి కూలిపోయింది. విమానాశ్రయానికి పక్కన గల కంకర కుప్పలో విమానం కూలిపోయింది. కూలిన క్షణాల్లోనే విమానంలో మంటలంటుకున్నాయి. ఆ మంటలు బోస్‌కు అంటుకున్నాయి. పక్కన ఉన్న రహ్మీన్ (కల్నల్ హబీబుర్ రెహ్మాన్), ఇతర ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్న బోస్ దుస్తులను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ మంటల వల్ల బోస్ శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయిందని జపాన్ ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అప్పుడు బోస్ వయసు 48 సంవత్సరాలని నివేదిక పేర్కొంది.