అంతర్జాతీయం

ఇది ‘జిహాద్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 29: ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో కాశ్మీర్ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత మళ్లీ అదే అంశంపై ఇక్కడ మాట్లాడారు. ఆదివారం ఇక్కడికి చేరుకున్న ఇమ్రాన్ ఖాన్ కాశ్మీరీల కోసం నిలబడిన వారంతా ‘జిహాద్’ చేస్తున్నారని, కాశ్మీరీలకు ప్రపంచం మద్దతు ఇవ్వకపోయినా పాకిస్తాన్ మాత్రం మద్దతు ఇస్తుందని అన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన తన తొలి ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశంపైనే కేంద్రీకరించారు. ఆదివారం ఇక్కడ ఆయన విమానాశ్రయంలో తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ప్రపంచం కాశ్మీరీల కోసం నిలబడినా, నిలబడకపోయినా మనం మాత్రం వారికోసం నిలబడతాం’ అని అన్నారు. ‘ఇది (కాశ్మీరీల కోసం నిలబడటం) జిహాద్’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇదో పోరాటం. సమయం అనుకూలంగా లేనప్పుడు గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు. నిరాశకు లోను కాకూడదు. ఎందుకంటే కాశ్మీరీలు (సహాయం కోసం) మనవైపే చూస్తున్నారు’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘పాకిస్తాన్ ప్రజలు మద్దతుగా నిలిస్తే కాశ్మీరీలు విజయం సాధిస్తారు’ అని కూడా ఆయన అన్నారు.