అంతర్జాతీయం

భారత్ వైఖరి తటస్థమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 1: అమెరికా దేశీయ రాజకీయాల విషయంలో భారత్ ఏ పక్షం వహించకుండా తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వివరించారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఉపయోగించిన ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అనే నినాదానే్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హూస్టన్‌లో జరిగిన ‘హౌడీ, మోదీ’ కార్యక్రమంలో ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ భారతీయ జర్నలిస్టులతో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మోదీ తన హూస్టన్ ప్రసంగంలో ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అనే నినాదం ఇచ్చారని ఒక విలేఖరి ప్రస్తావించగా, ‘లేదు. ఆయన అలా అనలేదు’ అని జైశంకర్ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన కోసం వాషింగ్టన్ డీసీకి వచ్చిన జైశంకర్.. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారనే వాదనను తోసిపుచ్చారు. ‘ప్రధాన మంత్రి ఏమి అన్నారనే దానిని దయచేసి జాగ్రత్తగా గమనించండి. నాకు జ్ఞాపకమున్నంత వరకు అప్పట్లో ట్రంప్ ఉపయోగించిన (అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్) నినాదానే్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించారు. పీఎం గతంలో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నారు. ఆయన అన్నదానిని మనం తప్పుగా విశే్లషించాలని నేను అనుకోవడం లేదు. ఇలా చేయడం ద్వారా మీరు ఎవరికయినా మంచి సేవ చేస్తున్నారని నేను భావించడం లేదు’ అని జైశంకర్ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

*చిత్రం... విదేశాంగ మంత్రి జైశంకర్