అంతర్జాతీయం

పాలస్తీనాలో గాంధీ స్టాంపు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజా, అక్టోబర్ 2: భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని పాలస్తీనా ప్రభుత్వం ఓ ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. ఆ దేశ టెలికమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి సిధాక్ సెదర్, అక్కడి భారత ప్రతినిధి సునీల్ కుమార్ ఈ స్టాంపును విడుదల చేశారు. గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు ఆచరణయోగ్యమని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గాంధీ కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని, ఆయన విశ్వనాయకుడని వారు ప్రశంసించారు. అదేవిధంగా టర్కీ, ఉజ్జెకిస్తాన్ దేశాలు కూడా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేశాయి.
ఉజ్జెకిస్తాన్ సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..గాంధీ బొమ్మతో ప్రత్యేక స్టాంపును ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. అదేవిధంగా టర్కీలోనూ గాంధీ తపాలా బిళ్ల విడుదలైంది.