అంతర్జాతీయం

వియత్నాం అందరికీ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, సెప్టెంబర్ 3: వియత్నాంలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి మోదీ శనివారం ఆ దేశ ప్రధాని గుయెన్ జువాన్ హుక్‌తో కలసి కాసేపు సరదాగా చేపలను వేటాడటంతోపాటు హనోయ్‌లోని చారిత్రక పగోడా దేవాలయాన్ని, వియత్నాం జాతీయ నేత హోచిమిన్ నివసించిన స్టిల్ట్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పగోడా దేవాలయంలో బౌద్ధ సన్యాసులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ, హింసాకాండను వీడి గౌతమ బుద్ధుడు ప్రవచించిన శాంతి మార్గంలో పయనించడంలో వియత్నాం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ‘యుద్ధాలతో రక్తపాతం తప్ప ప్రపంచానికి ఒరిగేదేమీ ఉండదు. అందరూ శాంతి మార్గాన్ని అనుసరించినప్పుడే సంతోషం, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి’ అని మోదీ స్పష్టం చేశారు. భారత్ నుంచి వియత్నాంకు బౌద్ధ ధర్మం వ్యాపించదనడానికి వియత్నాంలోని హిందూ దేవాలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలని, ఇరుదేశాల మధ్య ప్రాచీన కాలం నుంచే బలమైన సంబంధ బంధవ్యాలున్నాయనడానికి ఇవే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
వియత్నాంలో భారత ప్రధాన మంత్రి పర్యటించడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే భారత్-వియత్నాం మధ్య 2వేల సంవత్సరాల నుంచే సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్న విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకే వియత్నాం పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. ‘్భరత్, వియత్నాం మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎన్నో విధాలుగా ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో బౌద్ధ ధర్మానికి, హిందూ నాగరికతకు ఉన్న అనుబంధం ఎంతో ముఖ్యమైనది. యుద్ధానే్న లక్ష్యంగా చేసుకుని కొంతమంది ఇక్కడికి వచ్చారు. కానీ మేము మాత్రం శాంతి సందేశంతో ఇక్కడికి వచ్చాం’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

చిత్రం..పగోడా ఆలయంలో బౌద్ధ్ భిక్షువుల ఆశీర్వాదం తీసుకుంటున్న మోదీ