అంతర్జాతీయం

సరిహద్దు దాటకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పొరపాటున కూడా సరిహద్దును దాటవద్దని ఆక్రమిత కాశ్మీర్ (ఆజాద్ కాశ్మీర్) ప్రజలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హితవు పలికారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా సాగుతున్నదని, కాశ్మీర్‌లో ప్రజలు బయటకు రావడానికి వీల్లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సహజంగానే ఈ స్థితి అందర్నీ బాధిస్తుందని అన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలకు సాయం అందించడానికి వెళ్లవద్దని ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు సూచించారు. ఒక వేళ పొరపాటున సరిహద్దు దాటితే భారత్ అధికారులు దానిని చొరబాట్లకు ప్రయత్నాలుగా చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్‌లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నదని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చకు పెట్టాలన్న పాక్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై నిప్పులు చెరిగారు. మానవ హక్కులను భారత్ కాలరాస్తున్నదని ఆయన విరుచుకుపడ్డారు. నిరంతర కర్ఫ్యూ నీడలో కాశ్మీర్ ప్రజలు అల్లాడి పోతున్నారని ఆరోపించారు. అయితే ఇమ్రాన్ ఆరోపణలకు భారత్ దీటైన సమాధానాలు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నదని ఎదురుదాడి చేసింది. కాశ్మీర్ అంశం పూర్తిగా తమ అంతర్గత అంశమని తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా భారత్‌కే ఎక్కువ మద్దతు లభించడంతో కంగుతిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఎలాగైనా ఈ అంశాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా మరోసారి భారత్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు.

*చిత్రం...పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్