అంతర్జాతీయం

మహిళలూ ఒంటరిగా హోటళ్లలో ఉండొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, అక్టోబర్ 6: సౌదీ అరేబియాలో పర్యటించే మహిళలపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలలో కొన్నింటిని సడలించారు. సౌదీ అరేబియా పర్యాటక శాఖ ఆదివారం ఈ విషయం వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం మహిళలు పురుష సంరక్షకుడు తమతో లేకున్నా కూడా హోటల్ గదిని అద్దెకు తీసుకోవచ్చు. విదేశీ స్ర్తి,పురుషులు తమకు వివాహమయిందని నిరూపించుకోకుండానే ఒకే హోటల్ గదిలో బస చేయవచ్చు. సౌదీ అరేబియా విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి, చమురుపై ఆధారపడిన తన ఆర్థిక వ్యవస్థను బహుముఖం చేయడానికి చేస్తున్న కృషిలో భాగంగా తన తొలి పర్యాటక వీసా పథకాన్ని ప్రారంభించిన తరువాత పర్యాటకులపై ఇప్పటి వరకు ఉన్న కఠినమయిన ఆంక్షలను కొంత వరకు సడలించింది. సౌదీ డైలీ ఒకజ్ శుక్రవారం వెల్లడించిన వార్తను ధ్రువీకరిస్తూ సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ ఆదివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. సౌదీ మహిళలు ఐడీ కార్డు ద్వారా తమ గుర్తింపును నిరూపించుకొని, సౌదీ అరేబియాలో నివసిస్తున్న విదేశీ మహిళలు తమ రెసిడెన్సీ కార్డును చూపించి, పర్యాటకులుగా వచ్చిన మహిళలు తమ పాస్‌పోర్ట్‌ను చూపించి హోటల్ గదులను అద్దెకు తీసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. విదేశీ జంటలు కూడా తమ పాస్‌పోర్ట్‌లు చూ పిస్తే సరిపోతుందని, తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని (మ్యారేజ్ సర్ట్ఫికెట్) చూపించవలసిన అవసరం లేదని వివరించింది. మహిళలు తమతో పురుష సంరక్షకుడు ఉంటే ఎలాంటి గుర్తింపు పత్రం లేకున్నా హోటల్ గదిని అద్దెకు తీసుకోవచ్చు. అయితే, వారితో ఉన్న పురుష సంరక్షకుడికి మాత్రం గుర్తింపు కార్డు ఉండాలని కమిషన్ వివరించింది. సౌదీ అరేబియా కొత్త పర్యాటక వీసా పథకాన్ని గత వారం ప్రకటించింది.